Rahasyam Idam Jagath: చరిత్రలో తొలిసారి.. అమెరికాలో తెలుగు సినిమా టీజర్ రిలీజ్
ABN , Publish Date - Sep 30 , 2024 | 06:48 PM
సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే అమెరికాలో టీజర్ విడుదల జరిగిన ఇదే తొలి తెలుగు చిత్రంగా ఈ మూవీ రికార్డుల్లోకి ఎక్కింది.
కొత్తదనంతో కూడిన చిత్రాలను, వైవిధ్యమైన కథలను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారనే దానికి ఈ మధ్యకాలంలో హిట్టవుతున్న సినిమాలే నిదర్శనం. అందులోనూ ఆసక్తిని కలిగించే సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్ అంటే.. అలాగే మన పురాణాలు, ఇతిహాసాల గురించి ఏదైనా అంశంతో రూపొందిన చిత్రమంటే ఎంత ఆసక్తి చూపిస్తారనేది ‘కల్కి 2898AD’ తెలియజేసింది. సరిగ్గా అలాంటి జానర్‌లోనే రాబోతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్’ (Rahasyam Idam Jagath). రాకేష్ గలేబి (Rakesh Galebhe), స్రవంతి పత్తిపాటి (Sravanthi Prattipati), మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా నటిస్తోన్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ (Komal R Bharadwaj) దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నవంబరు 8న విడుదల కానుంది.
ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం టీజర్‌ను అమెరికా డల్లాస్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లోని క్యాంపస్ మూవీ థియేటర్‌లో విడుదల చేశారు. తొలిసారిగా ఓ తెలుగు చిత్రం అమెరికాలో టీజర్ విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి యూనివర్శిటీ స్టూడెంట్స్, తానా, నాటా, ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఇప్పటి వరకు యూఎస్‌లో ఇలాంటి ఫంక్షన్ జరగడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఎత్తున్న ఆడియన్స్ హాజరయ్యారు. ఈ టీజర్‌ను గమనిస్తే సైన్స్ ఫిక్ష్‌న్‌కు మైథలాజికల్ అంశాలతో పాటు థ్రిల్లింగ్ అడ్వెంచెరస్ నేపథ్యంలో ఇండియన్ హిస్టారికల్ అంశాలను వెలికితీసే టీమ్‌కు ఎదురైన వింత అనుభవాలతో ఈ చిత్రం రూపొందినట్లుగా అనిపిస్తుంది. ఇక టీజర్ చూస్తుంటే అందరిలో సినిమాపై మంచి బజ్, ఇంట్రెస్ట్ కలుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ చిత్రం గురించి దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ మాట్లాడుతూ 'మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకొని సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ అంశాలకు మంచి ట్విస్ట్‌లు జోడించి ఈ చిత్రం రూపొందించామన్నారు. ముఖ్యంగా మన శ్రీచక్రం, శ్రీ యంత్రం, మన చారిత్రాత్మక చరిత్ర గురించి చెబుతున్న పాయింట్ అందరికి గూజ్‌బంప్స్ తీసుకొచ్చే విధంగా ఉంటుందని, తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్నారు. ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్ విజువల్స్ కూడా ఈ చిత్రంలో ఉంటాయని తప్పకుండా ఈ చిత్రం అందరినీ సర్‌ఫ్రైజ్ చేస్తుందని.. నవంబరు 8న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నాం' అన్నారు.