Game Changer: ‘గేమ్ చేంజర్’ నుంచి.. ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్ రిలీజ్
ABN , Publish Date - Sep 30 , 2024 | 04:39 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ నుంచి ‘రా మచ్చా మచ్చా..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ పాటను నకాష్ అజీజ్ ఆలపించగా తమన్ బాణీలు అందించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’(Game Changer). శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘రా మచ్చా మచ్చా..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను నకాష్ అజీజ్ ఆలపించగా తమన్ బాణీలు అందించారు. ముఖ్యంగా ఈ పాటలో ఇంద్ర సినిమాలోని చిరంజీవి వీణ స్టెప్‌ను రీ క్రియేట్ చేయడం విశేషం.
‘రా మచ్చా మచ్చా..’ సాంగ్ ప్రోమో విషయానికి వస్తే.. రామ్ చరణ్ (Ram Charan) ఇంట్రడక్షన్ సాంగ్‌గా రూపుదిద్దుకున్న ఈ సాంగ్‌ను భారతీయ సినీమా చరిత్రలో నెవ్వర్ బిఫోర్ అనేలా స్టార్ డైరెక్టర్ శంకర్ తన మార్క్‌ను చూపిస్తూ తెరకెక్కించారనేది ఈ ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. ఎనర్జిటిక్, స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్ ఆకట్టుకుంటున్నారు. ఇక గ్రేస్‌తో ఆయన వేసిన హుక్ స్టెప్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఈ స్టెప్ నెట్టింట ఓ రేంజ్లో వైరల్ అవుతుందనటంలో సందేహం లేదు. ఇందులో ఏకంగా 1000కి పైగా జానపద కళాకారులు ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్నత్వానికి ఏకత్వమైన మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు.. ఇందులో భాగం అయ్యారు.