Pushpa target: ఆ టార్గెట్‌ను పుష్పరాజ్‌ చేరుకుంటాడా?

ABN , Publish Date - Nov 28 , 2024 | 08:05 PM

అడ్వాన్స్‌ బుకింగ్‌ పరంగానూ రికార్డ్‌లో సృష్టిస్తుందని అభిమానులు చెబుతున్నారు. అయితే గతంలో కూడా ఇలా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో కొన్ని చిత్రాలు అత్యధిక వసూళ్లు రాబట్టి రికార్డ్‌ సృష్టించాయి.


ప్రస్తుతం ఏ మాధ్యమంలో చూసిన పుష్ప ఫీవర్‌ (Pushpa Fever) కనిపిస్తోంది. పట్నాలో ఈవెంట్‌ జరిగినప్పటి నుంచి సినిమాకు మరింత హైప్‌ పెరిగిపోయింది.ఈ  చిత్రం అడ్వాన్స్‌ బుకింగ్‌ త్వరలో (Pushpa Advance booking) ప్రారంభం కానుంది. దాని కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలు వ్యూవర్‌షిప్‌లో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం అడ్వాన్స్‌ బుకింగ్‌ పరంగానూ రికార్డ్‌లో సృష్టిస్తుందని అభిమానులు చెబుతున్నారు. అయితే గతంలో కూడా ఇలా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో కొన్ని చిత్రాలు అత్యధిక వసూళ్లు రాబట్టి రికార్డ్‌ సృష్టించాయి.

బాహుబలి 2:  ఈ చిత్రం విడుదలకు ముందే అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా రూ.100 కోట్లకు పైగా (గ్రాస్‌) రాబట్టింది. ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించిన సినిమిగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా   అడ్వాన్స్‌ బుకింగ్‌ ఈ చిత్రంతో పోటీపడలేకపోయింది.

కేజీఎప్‌ చాప్టర్‌ 2: కన్నడస్టార్‌ యష్‌ నటించిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ మొదటి రోజు 80 కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా వచ్చింది. ఇది చాలా పెద్ద సంఖ్యే. ఈ సినిమాకి ఎంత క్రేజ్‌ ఏర్పడిందో తెలిసిందే. రిలీజ్‌ తర్వాత సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని ముందే ఊహించారు ట్రేడ్‌ పండితులు.

ఆర్‌ఆర్‌ఆర్‌:
రాజమౌళి దర్శకత్వంలో తారక్‌, రామ్‌చరణ్‌ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఎంత బ్లాక్‌ బస్టర్‌ అయిందో తెలిసిందే. ఈ చిత్రం కూడా అడ్వాన్‌ బుకింగ్‌లో ఎక్కడా తగ్గలేదు. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్‌ బుకింగ్‌ రూపంలో రూ. 58 కోట్లు వసూలు చేసింది.

కల్కి: ఇటీవల విడుదలైన ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఎడీ’ కూడా థియేటర్లలోకి రాకముందే భారీ అడ్వాన్స్‌ బుకింగ్‌లో అదరగొట్టింది. మొదటి రోజు 20 లక్షల 93 వేల 904 టిక్కెట్లను ముందస్తుగా బుకింగ్‌ అయ్యాయి.  కేవలం అడ్వాన్స్‌ బుకింగ్‌తోనే రూ. 51 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌ టాప్‌ ఫైవ్‌ లిస్ట్‌లో నాలుగో స్థానంలో ఉంది. దీనికి సీక్వెల్‌ వచ్చే చిత్రం కల్కి-2కు కూడా అంతే క్రేజ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సలార్‌: ఈ జాబితాలో సలార్‌ కూడా చేరింది. అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఈ సినిమా కూడా సందడి చేసింది. తొలిరోజు అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఈ సినిమా రూ.49 కోట్లు వసూలు చేసింది. దీనికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. దీని సీక్వెల్‌  2025లో రానుంది.

మరి పుష్ప-2 ఈ చిత్రాల జాబితాలో చేరుతుందా? అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఈ స్థాయి రికార్డ్‌ సృష్టిస్తుందా అన్నది చూడాలి. అయితే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను బట్టి చూస్తే అదంత పెద్ద కష్టం కాదనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తం పుష్ప-2 చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.


 

Updated Date - Nov 28 , 2024 | 08:12 PM