Sukumar: సుకుమార్ నెక్స్ట్ ఏంటి?
ABN , Publish Date - Dec 06 , 2024 | 03:08 PM
‘పుష్ప 2’ కోసం మూడేళ్ల పాటు నిర్విరామంగా కష్టపడ్డాడు దర్శకుడు సుకుమార్ (Sukumar). కొన్ని లాజిక్‌లు, ల్యాగ్ పక్కనపెడితే తగిన ఫలిలమే అందుకున్నారు.
‘పుష్ప 2’ (Pushpa2) కోసం మూడేళ్ల పాటు నిర్విరామంగా కష్టపడ్డాడు దర్శకుడు సుకుమార్ (Sukumar). కొన్ని లాజిక్‌లు, ల్యాగ్ పక్కనపెడితే తగిన ఫలిలమే అందుకున్నారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా 'పుష్ప 3 కూడా ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పట్లో కాదు.. కొంతకాలం తర్వాత అని అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సుకుమార్ మరో మూడేళ్లు సమయం ఇస్తే చేసేస్తా అన్నారు. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పట్టొచ్చు. మరి ఈ గ్యాప్ సుకుమార్ ఏం చేస్తారు.. ఆయనకున్న కమిట్‌మెంట్స్ ఏంటి? వాట్ నెక్ట్స్ అంటూ ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ‘పుష్ప 2’ తరవాత రామ్ చరణ్‌తో సుకుమార్ ఓ సినిమా చేయాలి. అయితే దానికి టైమ్ ఉంది. సుకుమార్ దగ్గర కథ కూడా సిద్థంగా లేదు. పైగా చరణ్ బుచ్చిబాబుతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. అది పూర్తయ్యేలోగా సుకుమార్ కథ రెడీ చేసుకోవొచ్చు. సో చాలా సమయం ఉంది. ఈలోగా సుకుమార్ సెట్ చేయాల్సిన ప్రాజెక్ట్‌లు కొన్ని ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్‌లో సెట్స్‌పైకి వెళ్లిన ‘సెల్ఫిష్’కు కొన్ని రిపేర్లు అవసరం. సెకండాఫ్‌లో కొంత గందరగోళం ఉందని, సుకుమార్ కూర్చుని సెట్ చేయాలని తెలుస్తోంది. దిల్ రాజు కూడా ఇదే విషయం గతంలో ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. సుకుమార్ రైటింగ్స్ లో రెండు సినిమాలు త్వరలో పట్టాలెక్కబోతున్నాయి. వాటి కథలు విని, ఓకే చేయాలి సుకుమార్. ఆయన గత కొంతకాలంగా నడుము నొప్పితో బాధపడుతున్నారు. దానికి ట్రీట్‌మెంట్ అవసరం. త్వరలో సుకుమార్ అమెరికా వెళ్లే అవకాశం ఉంది. అక్కడ నడుం నొప్పికి ట్రీట్‌మెంట్ తీసుకొంటారని టాక్ వినిపిస్తోంది. అమెరికాలో కొంత కాలం ఉండి, కథపై అక్కడే కసరత్తులు చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి 2025లో సుకుమార్ నుంచి కొత్త సినిమాలేం పట్టాలెక్కకపోవొచ్చు. ఆయన బ్యానర్‌లో మాత్రం కొన్ని సినిమాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు చిత్రాలు సెట్స్ మీదున్నాయి. (what Next sukumar)