Chanakya Chandragupta: ఇప్పుడంటే 'పుష్ప 2' చూస్తున్నారు.. అప్పట్లోనే ఎన్టీఆర్
ABN , Publish Date - Dec 06 , 2024 | 11:53 AM
ఇపుడు 'పుష్ప 2' టికెట్ల ధరల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ.. అప్పట్లోనే సీనియర్ ఎన్టీఆర్ ఇంతకు మించిన రాద్దాంతమే చేశారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప 2' రేట్ల గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులో 1977లో రిలీజైన సీనియర్ ఎన్టీఆర్ మూవీ 'చాణక్య చంద్రగుప్త' హైలెట్‌గా నిలుస్తోంది. 'పుష్ప 2'కి సీనియర్ ఎన్టీఆర్ 'చాణక్య చంద్రగుప్త'కి సంబంధమేంటి అనుకుంటున్నారా? ఉంది, సంబంధం ఉంది. అదే టికెట్ల ధర.
తాజాగా 'పుష్ప 2' సినిమా టికెట్ ధర రూ. 1000ల అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహంలోనూ న్యాయం ఉంది. ఈ టికెట్ల ధర నియంత్రణ ప్రేక్షకుల చేతిలో లేని విషయం. దీనిని ప్రభుత్వాలు, నిర్మాణ సంస్థలు లోపాయకారి ఒప్పందాలతో డిసైడ్ చేస్తూ ఉంటాయి. అదంతా పక్కన పెడితే 1977లో వచ్చిన 'చాణక్య చంద్రగుప్త' సినిమా టికెట్ ధరలు బాల్కనీ మూడున్నర ఉండగా, నాన్ ఏసీ రెండు రూపాయల ముప్పై పైసలు నడిచింది. కానీ.. తిరుపతి, విజయవాడ సెంటర్‌లలో మార్నింగ్ షో టికెట్లను రూ. 150కి అమ్మేశారు. దీంతో ఆ లెక్కలను ఇప్పుడు 'పుష్ప 2' ధరలతో పోలుస్తున్నారు. ఇంకా ఇప్పుడు GST అదనం, అప్పట్లో ఈ టాక్స్ గొడవ కూడా లేదు అంటూ సెటైర్లు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. అయితే మార్నింగ్ షో రూ.150 పలికిన ఈ సినిమా టికెట్ ధర సాయంత్రం వరకు ఒరిజినల్ కి పడిపోయింది. మౌర్య సామ్రాజ్య చక్రవర్తి చంద్రగుప్తుడి చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ మౌర్యగుప్తుడిగా, అక్కినేని నాగేశ్వర్ రావు చాణక్యగా, శివాజి గణేశన్ అలెగ్జాండర్‌గా నటించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ప్లాప్‌గా నిలిచింది.