Pushpa 2: 'యానిమల్' కంటే వైల్డ్.. పుష్ప 2 రన్ టైమ్
ABN , Publish Date - Nov 27 , 2024 | 06:43 AM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'పుష్ప 2' చిత్రంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రన్ టైమ్ పై క్లారిటీ వచ్చేసింది.. ఎంతంటే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’ (Pushpa 2 The Rule). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రన్ టైమ్ క్లారిటీ వచ్చేసింది. ఎంతంటే..
సుకుమార్ సినిమాలంటేనే మినిమమ్ 3 గంటల రన్ టైమ్ కామన్. పుష్ప సినిమాకి ఒక నిమిషం తక్కువ 3 గంటలు చేసిన సుక్కు ఈ సారి 3 గంటల 22 నిమిషాల రన్ టైమ్ ని ఫిక్స్ చేశారు. యూఎస్ రన్ టైమ్ ని 3 గంటల 15 నిమిషాలకు కుదించారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ముగియడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' సినిమా 3 గంటల 22 నిమిషాల లాంగ్ రన్ టైమ్ తో విడుదలై సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే పుష్ప రన్ టైమ్ గురించి వర్రీ కావాల్సిన పనిలేదంటున్నారు. ఎంగేజింగ్ కథతో ప్రేక్షకులని కటిపడేస్తే 'పుష్ప రాజ్' మేనియని ఆపేవారే లేరు. ఇక బన్నీ ఫ్యాన్స్ అయితే 'యానిమల్' కంటే ఎక్కువ రుం టైమ్ తో రిలీజ్ అవుతున్న ఈ మూవీ 'యానిమల్' కంటే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఏదిఏమైనప్పటికీ పుష్ప రాజ్ మేనియా ఎలా ఉంటాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇక జూనియర్ ఎన్టీయార్ 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాప్ కావడంతో పుష్ప మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. సాధారణంగా పెద్ద హీరో సినిమా ఈవెంట్ అంటే అభిమానులు తాకిడి గట్టిగానే ఉంటుంది. ఆ సినిమా ఇంకా పాన్ ఇండియా రిలీజ్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీయార్ లాంటి మాస్ హీరో సినిమాకి నోవాటెల్ హోటల్ లో ఫంక్షన్ నిర్వహించడం ఎంత పెద్ద తప్పిదమో తెలిసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మూడేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'బన్నీ' పుష్ప 2 ఈవెంట్ కోసం ఒక పెద్ద స్టేడియం ని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. వెన్యూ కోసం పోలీసులు పర్మిషన్ కూడా ఇచ్చేశారు. యాసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో 'పుష్ప 2' ఈవెంట్ చేయనున్నారు. నవంబర్ 31 లేదా డిసెంబర్ 1న ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు.