Pushpa 2 Collections: ఫస్ట్ డే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్స్ బద్దలయ్యాయ్.. సరికొత్త హిస్టరీ

ABN , Publish Date - Dec 06 , 2024 | 07:32 PM

థియేటర్లలో గంగమ్మ జాతర, బయట కలెక్షన్ల జాతర అన్నట్లుగా ‘పుష్ప 2’ సినిమా ప్రభంజనం ఉంది. తాజాగా మూవీ టీమ్ డే 1 కలెక్షన్ల వివరాలను తెలియజేశారు. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు బద్దలవడమే కాకుండా.. సరికొత్త రికార్డులను పుష్పరాజ్ బాక్సాఫీస్‌‌కి పరిచయం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Pushpa 2 Movie Still

థియేటర్ల దగ్గర ‘పుష్పరాజ్’ జాతర మాములుగా లేదు. సినిమాలో గంగమ్మ జాతర, థియేటర్ల దగ్గర పుష్పరాజ్ జాతర అన్నట్లుగా టిక్కెట్స్ తెగిపడుతున్నాయ్. మొదటి నుండి అనుకున్నట్లుగానే ఈ సినిమా ఫస్ట్ డే ఇండియన్ సినిమా హిస్టరీలో ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టి.. ఆల్ టైమ్ రికార్డ్‌ని క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ డే కలెక్షన్లతో పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రకారం ఈ సినిమా రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి.. ఇండియన్ సినిమా డే 1 హిస్టరీలో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డును బాక్సాఫీస్ వద్ద నెలకొల్పింది.

Also Read- Daggubati Family: దగ్గుబాటి ఇంట్లో పెళ్లి కొడుకుగా చైతూ.. ఫొటోలు వైరల్

అంతేకాదు, ఇంతకు ముందు రాజమౌళి, రామ్ చరణ్, రామారావుల ‘RRR’ రికార్డులను కూడా బద్దల కొట్టి కలెక్షన్ల సునామీ సృష్టించేసింది. ఇంతకు ముందు ఉన్న ఆర్ఆర్ఆర్ డే 1 రికార్డ్ రూ. 233 కోట్ల గ్రాస్. పుష్పరాజ్ డే 1 సెట్ చేసిన రికార్డ్ రూ. 294 కోట్ల గ్రాస్. ఇది ఐకానిక్ స్టార్ సత్తా. ఇంకా నైజాం, హిందీ బెల్ట్‌లో కూడా ‘పుష్పరాజ్’ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. నైజాంలో ఇప్పటి వరకు ఉన్న ఆర్ఆర్ఆర్ రూ. 23 కోట్ల రికార్డును రూ. 30 కోట్లు రాబట్టి మరో హిస్టరీని నెలకొల్పాడు పుష్ప.


Pushpa-Raj.jpg

హిందీ వెర్షన్‌ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మొదటి రోజు రూ. 72 కోట్లు రాబట్టి.. ఇప్పటి వరకు హిందీలో డబ్బింగ్ అయిన చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్స్‌లోనే సరికొత్త రికార్డును నెలకొల్పినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇలా డే 1 మాత్రమే కాదు.. రాబోయే రోజులలో పుష్ప రికార్డుల గురించి చర్చించుకునేందుకు అంతా సిద్ధంగా ఉండండి అనే హింట్‌ని ఈ డే 1 కలెక్షన్స్ ఇస్తున్నాయంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్నా నటించిన ఈ చిత్రాన్ని బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

Also Read-Game Changer: గేమ్ ఛేంజర్‌కి దెబ్బేసిన 'పుష్ప 2'

Also Read-SoChay Wedding: ఘనంగా నాగ చైతన్య, శోభితల వివాహం.. కింగ్ నాగ్ స్పందనిదే..


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2024 | 07:32 PM