Pushpa 2: ఇంకేంత షూటింగ్ బాకీ ఉందంటే..

ABN , Publish Date - Oct 19 , 2024 | 09:25 AM

డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప 2 సినిమా షూటింగ్ ఇంకా పూర్తవలేదు. ఒక సీనియర్ యాక్టర్ డేట్స్ విషయంలో గందరగోళం ఏర్పడింది. ఇంతకీ ఏమైంది.. ఇంకా సినిమా షూట్ ఎంత పెండింగ్ ఉందంటే..

మూడేళ్ళుగా బన్నీ(Allu Arjun) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప 2( Pushpa 2). అనేక కారణాల వల్ల ఈ సినిమా షూట్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్ కూడా రెండు మూడు సార్లు మార్చారు మేకర్స్. అందరి అభిమాన స్టార్ హీరోల నుండి సినిమాలు వస్తున్న బన్నీ ఫ్యాన్స్ కళ్ళు మాత్రం కాయలు కట్టాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్(Sukumar) సినిమాని జెట్ స్పీడ్‌లో ముందుకు తీసుకెళ్తున్నాడు. డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా షూటింగ్ ఇంకా పూర్తవలేదు. ఒక సీనియర్ యాక్టర్ డేట్స్ విషయంలో గందరగోళం ఏర్పడింది. ఇంతకీ ఏమైంది.. ఇంకా సినిమా షూట్ ఎంత పెండింగ్ ఉందంటే..


సుకుమార్ సినిమా అంటే.. రిలీజ్‌కి వారం రోజుల ముందు కూడా షూట్ జరుగుతుంది. కాగా ఈ సినిమా రిలీజ్‌కి ఆల్మోస్ట్ 40 రోజులే ఉండటంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఈ సినిమా షూట్ ఇంకా 15-20 డేస్ బాకీ ఉందని సమాచారం. మరోవైపు సీనియర్ యాక్టర్ రావు రమేష్ డేట్స్ విషయంలో గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమా షూట్‌కి హాజరు కావాల్సి ఉండగా, నవంబర్ 2 వరకు ఆయన వేరే సినిమాకి కమ్మిట్ అయ్యారట. దీంతో రావు రమేష్ వచ్చే దాకా వెయిట్ చేస్తారా.. లేదా ఆయన రోల్‌ని కాస్త ట్రిమ్ చేస్తారా అనే చర్చ కొనసాగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 5న ప్రీమియర్ షోస్‌కి నవంబర్ మంత్ ఎండ్‌లోనే పూర్తి చేయడానికి మూవీ మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇంకా 40 రోజుల్లోనే మిక్సింగ్, ఫైనల్ కాపీ, ఓవర్ సీస్‌కు కంటెంట్ పంపించాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఫస్ట్ హాఫ్‌ను లాక్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఇచ్చేయడంతో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.


ఇటీవల పుష్ప 2లో తన పాత్రకు సంబంధించి షూటింగ్‌ పూర్తయిందని తెలియజేస్తూ నటుడు బ్రహ్మాజీ ఓ ఫొటో షేర్ చేసారు. అందులో బ్రహ్మాజీ, సుకుమార్‌, మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌‌తోపాటు యానిమల్‌ ఫేమ్‌ సౌరభ్‌ సచ్‌దేవ కనిపించారు. యానిమల్‌‌లో బాబీ డియోల్‌కు సోదరుడిగా నటించి ఆకట్టుకున్నారు సౌరభ్‌. యానిమల్ క్లైమాక్స్‌లో సౌరభ్‌కు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. పుష్ప 3 కూడా ఉండనుందన్న వార్తల నేపథ్యంలో సుకుమార్ పుష్ప 2 క్లైమాక్స్‌లో ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చి ఎండ్ చేయనున్నారని.. అందులో భాగంగానే సౌరభ్ పాత్ర ఉంటుందని తెలుస్తొంది.

Updated Date - Oct 19 , 2024 | 09:25 AM