Pushpa 2: ఇది వైల్డ్‌ ఫైర్‌ పుష్ప.. అప్పుడే వస్తుంది.. 

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:02 AM

అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa 2) సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తోంది.


అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa 2) సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఇండియన్‌ సినిమా చరిత్రలో ఏ కమర్షియల్‌ మూవీ సాధించనన్ని వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో ‘పుష్ప 2’  ఓటీటీకి రానున్నదంటూ సోషల్‌ మీడియా వేదికగా వార్తలు ట్రెండ్‌ అయ్యాయి. ముఖ్యంగా జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్ కానుందంటూ పోస్టులు కనిపించాయి. ఆ వార్తలపై చిత్రబృందం తాజాగా స్పందించింది. థియేటర్‌లో విడుదలైన 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్‌ కాదని స్పష్టం చేసింది. వెండితెరపైనే ‘పుష్ప 2’ను చూసి హాలీడే సీజన్‌ను ఎంజాయ్‌ చేయమని తెలిపింది. 'పుష్ప2: ది రూల్‌’ ఓటీటీ స్ట్రీమింగ్ పై అనేక వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. రాబోయే అతి పెద్ద హాలీడే సీజన్‌లో ఈ మూవీని బిగ్‌ స్క్రీన్ పై చూసి ఆస్వాదించండి. విడుదలైన నాటి నుంచి 56 రోజుల కన్నా ముందు ఏ ఓటీటీలోనూ ‘పుష్ప2’ స్ర్టీమింగ్‌ కాదు. ఇది వైల్డ్‌ ఫైర్‌ పుష్ప. వరల్డ్‌ వైడ్‌గా థియేటర్స్‌లోనే’’ అని ఎక్స్‌లో మైత్రీ మూవీ మేక్సర్‌ పోస్ట్‌ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా రూ.1,508 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ‘కేజీయఫ్‌2’ (రూ.1250 కోట్లు), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్‌ కలెక్షన్లు దాటేసిన ‘పుష్ప2’.. ‘బాహుబలి2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా నడుస్తోంది. అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన ఇండియన్‌ సినిమాల జాబితాలో ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ (రూ.2,024 కోట్లు) ఇప్పటికీ టాప్‌లో ఉంది. ముంబయి సర్క్యూట్‌లో రూ.200 కోట్లు (నెట్‌) సాధించిన  తొలి సినిమాగా రికార్డు సృష్టించిన ‘పుష్ప 2’ హిందీలో రూ.632 కోట్లు (నెట్‌) వసూలు చేసి,  100 ఏళ్ల బాలీవుడ్‌ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. విడుదలైన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని వసూలు చేయడం మరో విశేషం.

Updated Date - Dec 22 , 2024 | 11:02 AM