Pushpa 2: 'పుష్ప-2' డిస్ట్రిబ్యూటర్ వ్యాఖ్యలు.. కన్నడిగులు ఫైర్
ABN , Publish Date - Oct 26 , 2024 | 02:23 PM
'పుష్ప 2' చిత్రం విడుదల గురించి ఇటీవల హైదరాబాద్‌లో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్‌తో కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వేదికపై కన్నడ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడనాట వివాదానికి గురి చేసింది.
'పుష్ప 2' చిత్రం విడుదల గురించి ఇటీవల హైదరాబాద్‌లో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్‌తో కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వేదికపై కన్నడ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడనాట వివాదానికి గురి చేసింది. 'పుష్ప 2 చిత్రాన్ని కేజీఎఫ్, కాంతార రికార్డులు బద్దలయ్యే స్థాయిలో విడుదల చేస్తామని, మాగ్జిమం షోలను ప్లాన్ చేస్తామని వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ మాటే కన్నడిగులకు మండేలా చేసినట్లయింది. తమ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను దాటుతామని చెప్పడంతో కన్నడ సినీ అభిమానులు సోషల్ మీడియాలో అసహానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర సినిమాల ఆధిపత్యం మీద అక్కడి నిర్మాతలు కొందరు చాలాకాలంగా గుర్రుగా ఉన్నారు. తెలుగు చిత్రాలైన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, సలార్ టైంలో వాటికి ఎక్కువ స్ర్కీన్లు ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారంటూ విమర్శలు కూడా చేశారు. అలాగే ఎప్పటి నుంచో డబ్బింగ్ సినిమాల విడుదలను అడ్డుకుంటు వస్తున్నారు. ఇతర భాషా చిత్రాలను కట్టడి చేయాలనే డిమాండ్ అక్కడ కొంత కాలంగా ఉంది. కన్నడ సీనియర్ హీరో రాజ్ కుమార్ ఉన్న కాలంలోనే ఇతర భాషా సినిమాల విడుదలను ఆపేసిన పరిస్థితి. అయితే కొన్నేళ్ల క్రితమే ఆ రూల్స్‌ను తీసేశారు.
అప్పటి నుంచి అక్కడ ఏ సినిమా విడుదలైనా కన్నడ వెర్షన్ కంటే ఇప్పటికీ తెలుగు, తమిళం ఒరిజినల్ వెర్షన్లే ఎక్కువ ప్రదర్శనలు జరుగుతున్నాయనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా పుష్ప 2 కన్నడ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసినట్లయింది. నిజానికి డిసెంబర్ మొదటివారంలో పుష్ప 2 మినహా చెప్పుకొదగ్గ కన్నడ సినిమాలేవీ రిలీజ్ లేవు. కానీ కన్నట నాట వారి భాషకు సంబంధించి అక్కడి ప్రజలు పలు సంఘాలు చాలా పర్టిక్యూలర్‌గా ఉంటున్నాయి. కర్ణాటకలో ఉండే వారు కచ్చితంగా కన్నడ మాట్లాడాల్సిందేనంటూ ఇటీవలే కొన్ని వార్నింగ్‌లు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 2' విడుదలపై కన్నడ సినిమాలను మించి చేస్తాం అనడం మరో రచ్చకు దారి తీశాయి. కన్నడిగుల కోపం పుష్ప-2పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మరి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.