Pushpa 2: పుష్పకు ఐదు కట్స్‌.. నిడివి ఎంతో తెలుసా

ABN , Publish Date - Nov 28 , 2024 | 07:18 PM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప2: ది రూల్‌’ డిసెంబర్‌ 5న విడుదలకు సిద్థమైన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ‘పుష్ప2’ రన్‌టైమ్‌ పైనే సోషల్‌ మీడియాఓల చర్చ నడుస్తోంది.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa : the rule)డిసెంబర్‌ 5న విడుదలకు సిద్థమైన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ‘పుష్ప2’ రన్‌టైమ్‌ పైనే సోషల్‌ మీడియాఓల చర్చ నడుస్తోంది. మూడున్నర గంటలకు తగ్గకుండా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ‘తగ్గేదేలే’ అన్నట్లు 3 గంటలా 20 నిమిషాల38 సెకన్ల నిడివితో సినిమా రాబోతోంది. ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌ అవుతోంది. సెన్సార్‌ బోర్డు  సర్టిఫికెట్‌లో మొత్తం ఐదు విషయాల్లో మార్పు చేర్పులు చెప్పింది. ‘రండి’ అనే పదాన్ని మరొక పదంతో మార్చగా, మరో అసభ్య పదాన్ని మ్యూట్‌ చేయమని సూచించింది. ఇక వెంకటేశ్వర్‌ అనే మాటను భగవంతుడుగా మార్చమన్నది. విలన్‌ కాలుని హీరో నరకగా అది గాలిలో ఎగిరే సీన్‌, నరికిన చేతిని హీరో పట్టుకునే సన్నివేశాలను సీజీతో కవర్‌ చేయమని చెప్పింది.

Sukumar.jpg

పుష్ప పాన్‌ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా ‘పుష్ప2: ది రూల్‌’ చిత్రాన్ని సుకుమార్‌ తెరకెక్కించారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. 

Updated Date - Nov 28 , 2024 | 07:22 PM