Pushpa 2: రాజమౌళి, కేజీఎఫ్ రికార్డులను 'పుష్ప 2' బ్రేక్ చేయగలదా..

ABN , Publish Date - Nov 22 , 2024 | 07:33 AM

ఫాంటసీ, గ్రాఫిక్స్ లేని ఒక మాస్ కమర్షియల్ సినిమా రూ. 1000 కోట్లు కొల్లగొట్టగలదా? 'పుష్ప రాజ్' మేనియా చూసి సాధ్యమే అంటున్నారు. ఎలా అంటే..

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' పుష్ప రాజ్ అవతారంలో బాక్సాఫీస్ ని ఏలేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఎవరు ఊహించని రీతిలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు మరో రెండు వారాల్లో పుష్ప గాడి రూల్ థియేటర్ లలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప ఎన్ని కాసులు వెనుకేసుకొస్తాడనే చర్చ మొదలైంది. 'పుష్ప 2' హైప్ చూస్తుంటే సరికొత్త చరిత్రకి కొత్త అధ్యాయం కానున్నట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఈ సినిమా రాజమౌళి, కేజీఎఫ్ సినిమాల బ్రేక్ చేయగలుగుతుందా? చేయాలి అంటే ఏం జరగాలంటే..


'పుష్ప' సినిమాలో 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' అనే సాంగ్ లోని లిరిక్స్ "ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనేతప్పొప్పులు తాగాలెట్టే నిప్పు నేనేనన్నైతే కొట్టేటోడు భూమిదే పుట్టలేదు" ప్రస్తుతం అల్లు అర్జున్ కి సరిగ్గా సూట్ అయ్యాలే అనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో ఆయనపై ఎంత నెగిటివిటీ ఉన్న.. వాస్తవానికి సినీ విశ్లేషకులకు, నిర్మాతలకు పుష్ప గాడి రేంజ్ ఏంటో ఆర్డమైపోతుంది. ఇప్పటికే ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ రైట్స్ ని హిందీలో అనిల్ తదాని కొని భారీ రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాకి పోటీగా నిలుస్తుందనకున్న 'చావా' సినిమా కూడా పోటీ నుండి తప్పించుకోవడంతో సోలో రిలీజ్ లభించింది. దీంతో సినిమాకి ఎలాంటి టాక్ వచ్చిన హిందీ బెల్ట్ నుండి ఈ సినిమాకి ఒక 300,400 కోట్లు ఖాయం.

Untitled-1 copy.jpg


ఇక హిట్ టాక్ వస్తే తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల నుండి 600 నుండి 700 కోట్లు గ్రాస్ ఈజీ అంటున్నారు. ఈ లెక్కన ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే రూ. 1000 కోట్ల రికార్డ్ కొట్టడం చాలా సులభం. ఇక బ్లాక్ బస్టర్ అయితే ఊచకోతే అంటున్నారు. ఫాంటసీ, గ్రాఫిక్స్ లేని ఒక మాస్ కమర్షియల్ సినిమా ఇన్ని రికార్డ్ లు చేయడం అంత సులభం కాదు కానీ పుష్ప మేనియా చూస్తే సాధ్యమే అనిపిస్తుంది. ఇప్పటికే హిందీలో, తెలుగులో పెద్ద సినిమాల రిలీజ్ కోసం అభిమానులు ఎంతో కసిగా వేచి చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయినా దేవర సినిమా హిట్ అయినా డోస్ సరిపోలేదంటున్నారు అభిమానులు. అంత కరెక్ట్ గా జరిగితే ఈ సినిమా 1000 కోట్ల మైలు దాటి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు.


ఒకవేళ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఊచకోత ఇంతకు మించి ఉంటుంది. ఎందుకంటే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండింటిలోనూ గత కొన్ని నెలలుగా ఊర మాస్ బొమ్మ లేదు. దేవర ఒక్కటే విజయం సాధించింది. కానీ వెయ్యి కోట్లు సాధ్యం కాలేదు. అయిదు వందలు దాటాక నెమ్మదించింది. కానీ పుష్ప 2 కేసు వేరు. బాగుందనే మాట వస్తే చాలు ఊచకోత మాములుగా ఉండదు. టికెట్ రేట్ల పెంపు అడ్వాంటేజ్ అదనం. జనవరి 20 కొత్త రిలీజులు వచ్చేదాకా పదిహేను రోజుల సమయం దొరుకుంటుంది. బాహుబలి, రాజమౌళి, కెజిఎఫ్ రికార్డులను గురిపెట్టుకున్న పుష్ప 2 అన్నంత పని చేస్తే మాత్రం సరికొత్త చరిత్ర లిఖితమవుతుంది. రాజమౌళి, కేజీఎఫ్ రికార్డులను టచ్ చేసి బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు.

Updated Date - Nov 22 , 2024 | 07:33 AM