Pushpa 2: బాస్‌ని టార్గెట్ చేసిన బన్నీ.. పుష్పలో కాంట్రవర్షియల్ డైలాగ్స్
ABN , Publish Date - Dec 05 , 2024 | 03:11 PM
'పుష్ప 2' సినిమాలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగ్స్ ఉన్నాయంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బుధవారం హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. కానీ.. సాయంత్రం దేశవ్యాప్తంగా సునామీ సంభవించింది. పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్ అనే వ్యక్తి సుకుమార్ అనే లెక్కల మాస్టర్‌తో కలిసి మారణహోమం సృష్టించాడు. దీంతో సినిమా థియేటర్ల వద్ద ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మరోవైపు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాస్‌గా పిలవబడే చిరంజీవిని ఆయన పరోక్షంగా తన డైలాగ్ లతో టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'పుష్ప 2' ఈరోజు థియేటర్ లలో ప్రేక్షకుల ముందు వచ్చింది. బుధవారం సాయంత్రం బెనిఫిట్ షోలను ముగించుకొని బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సంపాదించుకుంది. కలెక్షన్ల సునామీ కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా రచ్చ జరుగుతుంటే మూవీలోని కొన్ని డైలాగులు ఈ మంటల రచ్చకి పెట్రోల్ పోసి మరింత ఆజ్యం పోశాయి. ఈ సినిమాలో "ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్.. ఆడికీ, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్" అనే డైలాగ్ వైరల్ గా మారింది. ఈ డైలాగ్ తో డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లను టార్గెట్ చేశాడా అనే అనుమానులు రేకెత్తుతున్నాయి. దీంతో మరోసారి తెరపైకి మెగా వర్సెస్ అల్లు అనే టాపిక్ వచ్చింది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎర్రచందనం కూలీగా కెరీర్ మొదలుపెట్టి సిండికేట్‌ని, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు పుష్పరాజ్ (అల్లు అర్జున్). అధికార పార్టీకి సైతం ఫండ్ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. సీఎంను కలిసి వద్దామని పుష్ప బయలుదేరితే.. ‘వస్తూ వస్తూ సీఎమ్‌తో ఓ ఫొటో తీసుకుని రా’ అంటూ తన భార్య శ్రీవల్లి(రష్మిక) కోరిక కోరుతుంది. (రష్మిక). అయితే స్మగ్లర్లు పార్టీ ఫండ్ ఇచ్చేంత వరకే కానీ ఫొటోలు దిగడానికి కాదని అధికార సీఎం హేళనగా మాట్లాడతాడు. దానిని సీరియస్‌గా తీసుకున్న పుష్ప ఎంపీ సిద్దప్ప (రావు రమేష్)తో ఓ ఫొటో తీసుకొని, తననే ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు. అందుకోసం రూ.500 కోట్లు ఫండ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు. దాని కోసం 2000 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఆ స్మగ్లింగ్‌ని ఆపడానికి, తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజల్) ప్రయత్నాలు చేస్తాడు. భన్వర్ సింగ్ షెకావత్‌ని దాటుకొని ఆ 2000 వేల టన్నులు స్మగ్లింగ్ చేయగలిగాడా, లేదా? శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు? ఇంటి పేరు, కుటుంబం కోసం పాకులాడే పుష్పకు అది ఎలా దక్కింది? అన్నది కథ.