Mr Celebrity: ‘మిస్టర్ సెలెబ్రిటీ’ విజయంతో నిర్మాత హ్యాపీ
ABN , Publish Date - Oct 10 , 2024 | 11:46 PM
అక్టోబర్ 4న విడుదలైన ‘మిస్టర్ సెలెబ్రిటీ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కడంతో.. ప్రస్తుతం ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు వచ్చిన టాక్‌తో, సక్సెస్‌తో నిర్మాతలలో ఒకరైన పాండు రంగారావు తన సంతోషాన్ని తెలియజేశారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త నీరు ప్రవహిస్తోంది. కొత్త దర్శకులు, ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్, కొత్త హీరోలు తమ అదృష్టం పరిష్కించుకునేందుకు ఇండస్ట్రీకి వస్తున్నారు. చాలా వరకు సక్సెస్ కూడా అవుతున్నారు. అలా వచ్చే వారంతా రొటీన్‌గా కాకుండా కొత్తగా ట్రై చేస్తుండటంతో డిఫరెంట్ కంటెంట్, కొత్త కాన్సెప్ట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా ‘మిస్టర్ సెలెబ్రిటీ’ (Mr Celebrity) అనే చిత్రం వచ్చింది. అక్టోబర్ 4న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కడంతో.. ప్రస్తుతం ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు వచ్చిన టాక్‌తో, సక్సెస్‌తో నిర్మాతలలో ఒకరైన పాండు రంగారావు (Producer Pandu Rangarao) సంతోషం వ్యక్తం చేశారు.
Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్టయన్... ది హంటర్’ ఎలా ఉందంటే..
‘మిస్టర్ సెలెబ్రిటీ’ సినిమాను ఆర్‌పి సినిమాస్ బ్యానర్‌పై చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మించారు. బిజినెస్ రంగంలో ఎంతో బిజీగా ఉన్నా కూడా పాండు రంగారావు సినిమాల మీద మక్కువతో ఈ సినిమాను నిర్మించినట్లుగా తెలిపారు. మొదటి చిత్రంతోనే నిర్మాతగా ఆయన తన అభిరుచిని చాటుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మిస్టర్ సెలెబ్రిటీని చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ గురించి ఆయన మాట్లాడుతూ..
నా అభిరుచిని చాటిచెప్పేలా వచ్చిన ఈ సినిమా ఇంత మంచి ఆదరణను పొందడం ఎంతో సంతోషాన్నిచ్చింది. దర్శకుడిగా మొదటి చిత్రమే అయినా చందిన రవి కిషోర్ చాలా బాగా తెరకెక్కించారు. పరుచూరి సుదర్శన్ తన తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకు వస్తున్న రెస్పాన్స్ పట్ల చాలా ఆనందంగా ఉంది. ఆ పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్ అని టీమంతా అనుకున్నాం. అదే ప్రేక్షకులు కూడా అంటుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. అడిగిన వెంటనే పాత్రకు ఓకే చెప్పినందుకు ఆమెకు థాంక్స్. సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడ్డారు. వారందరికీ థ్యాంక్స్. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకదేవుళ్లకు థ్యాంక్స్. ఇకపై మరిన్ని మంచి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు.