Nani: నాని నిర్మాణంలో.. దర్శకుడు ఎవరంటే!

ABN , Publish Date - Jul 16 , 2024 | 10:29 AM

నేచురల్‌స్టార్‌ నాని ఓ వైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు తన సొంత బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తున్నారు. 'హిట్‌' సిరీస్‌ చిత్రాలను ఆయన కొనసాగించనున్నారు. ప్రస్తుతం ఆ కసరత్తుల్లో ఉన్నారు.

నేచురల్‌స్టార్‌ నాని (Nani)ఓ వైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు తన సొంత బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తున్నారు. 'హిట్‌' సిరీస్‌ చిత్రాలను ఆయన కొనసాగించనున్నారు. ప్రస్తుతం ఆ కసరత్తుల్లో ఉన్నారు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్ బ్యానర్‌లో మరికొన్ని చిత్రాలు ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. తాజాగా నాని ఓ చిత్రాన్ని ప్రకటించారు. ప్రియదర్శి (Priyadarshi)హీరోగా ఓ సినిమాని నిర్మించబోతున్నారాయన. ఈ సినిమాతో జగదీశ్‌ (Jagadish) అనే కొత్త దర్శకుడు పరిశ్రమకి  పరిచయం కాబోతున్నారు. ఈ కథను నాని దగ్గరకు తీసుకెళ్లింది ప్రియదర్శినే. 

తాజాగా జరిగిన ‘డార్లింగ్‌’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నాని. ఈ వేదికలో తన నిర్మాణంలో ఈ కొత్త సినిమాని అనౌన్స్‌ చేశారు. 'దర్శి అద్భుతమైన ప్రతిభ గల నటుడు. అతన్ని హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మించబోతున్నా. ఈ సినిమాకి జగదీశ్‌ దర్శకత్వం వహిస్తారు. తనని నా వద్దకు తీసుకొచ్చింది దర్శినే. జగదీశ్‌ కథ చెప్పిన తర్వాత మా బ్యానర్‌ నుంచి మరో మంచి దర్శకుడుని లాంచ్‌ చేస్తున్న ఫీలింగ్‌ వచ్చింది. జానర్‌, మిగతా వివరాలు త్వరలో చెప్తాను’’ అని అన్నారు నాని. 

Updated Date - Jul 16 , 2024 | 10:32 AM