Prithveeraj -Seethal:పెళ్లి కాలేదు.. సహజీవనంలో ఉన్నాం
ABN , Publish Date - Mar 19 , 2024 | 10:13 AM
సీనియర్ నటుడు పృథ్వీరాజ్ నుంచి విడిపోయినట్లు శీతల్ తెలిపారు. కొంతకాలంగా సహజీవనంలో ఉన్న వీరిద్దరూ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని శీతల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
సీనియర్ నటుడు పృథ్వీరాజ్ నుంచి విడిపోయినట్లు శీతల్ తెలిపారు. కొంతకాలంగా సహజీవనంలో ఉన్న వీరిద్దరూ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని శీతల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘మాకు పెళ్లి కాలేదు. కేవలం సహజీవనంలో ఉన్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మా బంధం అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. కాబట్టి, వేర్వేరుగా ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. మా నిర్ణయాన్ని గౌరవించి దయచేసి మాకు కాస్త సమయం ఇవ్వండి’’ అని పోస్ట్ పెట్టింది.
‘పెళ్లి’, 'పెళ్లి పందిరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి చిత్రాలతో అలరించిన పృథ్వీరాజ్ ప్రస్తుతం టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. శీతల్ అనే అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నానని రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘శీతల్‌తో రిలేషన్‌లో ఉన్నా. ఆమె వయసు 24 ఏళ్లు. నా భార్య బీనాతో కొన్నేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దాంతో ఆమెకు దూరంగా వచ్చి ఒంటరిగా ఉంటున్నా. ఒంటరితనం వల్ల కుంగుబాటుకు గురయ్యా. అలాంటి సమయంలో శీతల్‌తో పరిచయమైంది. మా అభిరుచులు కలిశాయి.’’ అని ఆయన అన్నారు. వాలంటైన్స డే సందర్భంగా ఇటీవల ఓ టీవీ షోలో ఈ జంట సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వారి ప్రేమను వ్యక్త పరచుకుంట పెట్టిన పోస్ట్‌లను తొలగించారు.