Bimbisara2: క‌ళ్యాణ్ రామ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌కు ఫ్రీక్వెల్‌.. బింబిసార 2 లుక్‌ అదిరింది

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:58 PM

డెవిల్ చిత్రం త‌ర్వాత న‌వంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సినిమాల వేగం పెంచారు. తాజాగా ఆయ‌న న‌టించ‌నున్న బింబిసార సినిమా ఫ్రీక్వెల్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Bimbisara 2

డెవిల్ చిత్రం త‌ర్వాత న‌వంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Kalyanram Nandamuri) సినిమాల వేగం పెంచారు. ప్ర‌స్తుతం ఆయ‌న భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న‌ #NKR21 సినిమాలో నటిస్తోండగా విజ‌య‌శాంతి,శ్రీకాంత్‌, సోహైల్‌ఖాన్ వంటి ఆగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తను నటించబోయే తదుపరి సినిమా నుంచి ఇప్పుడు ఆప్డేట్ వచ్చింది.

ఈ రోజు (శుక్ర‌వారం) కల్యాణ్ రామ్ (Kalyanram Nandamuri) జన్మదినం సందర్భంగా మేక‌ర్స్ ఇప్పటికే #NKR21 సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, కొద్ది సేప‌టి త‌ర్వాత‌ తనకు గతంలోబ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెట్టిన బింబిసార (Bimbisara) చిత్రానికి ఫ్రీక్వెల్ గా తెరకెక్కనున్న NKR22 (బింబిసార2) చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసి కళ్యాణ్ రామ్‌కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.


GRtJUT2XYAAFczS.jpeg

బింబిసారునికి పూర్వం త్రిగర్తల రాజ్యాన్ని పాలించిన ఒక పురాణగాధను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్ష‌న్ ఇచ్చి గజ సైన్యం టీవీగా వస్తున్నట్లు ఉన్న ఆ పోస్టర్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకునేలా ఉంది. ఇదిలాండ‌గా ఈ సినిమాను NTR Arts నిర్మిస్తోండ‌గా మొద‌టి సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వ‌శిష్ట‌నే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడా కొత్త వారెవ‌రైనా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jul 05 , 2024 | 01:14 PM