Pranita Subhash: ఇన్స్టా వేదికగా గుడ్‌ న్యూస్‌ చెప్పింది!

ABN , Publish Date - Jul 25 , 2024 | 01:23 PM

బెంగళూరు బ్యూటీ ప్రణీత సుభాష్‌ (Pranita subhash) రెండోసారి తల్లి కాబోతుంది. రౌండ్‌ 2 (Second Time pregnent) అంటూ పరోక్షంగా ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది.

బెంగళూరు బ్యూటీ ప్రణీత సుభాష్‌ (Pranita subhash) రెండోసారి తల్లి కాబోతుంది. రౌండ్‌ 2 (Second Time pregnent) అంటూ పరోక్షంగా ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది. 'ఏం పిల్లో.. ఏం  పిల్లడో', 'బావ' చిత్రాలతో  తెలుగు తెరకు పరిచయం అయినా ఆమె 'అత్తారింటికి దారేది’ (Atharintiki daaredi) చిత్రంతో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు వంటి స్టార్‌ హీరోల సరసన నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్‌: కథానాయకుడు చిత్రం తర్వాత ఆమె మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. అయితే ఈ ఏడాదిలో కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. 2021లో వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ప్రణీత వివాహం అయింది. 2022 జూన్‌లో వారికి ఆడబిడ్డ జన్మించింది. పాప పుట్టిన తర్వాత మళ్లీ పలు సినిమాల్లో కనిపించిన ప్రణీత తాజాగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.  ‘రౌండ్‌ 2... ఇక నుంచి ప్యాంట్‌లు సరిపోవు’ అంటూ చెప్పుకొచ్చింది. త్వరలోనే ప్రణీత మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది.

Pranitha.jpg
కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నా ప్రణీత సేవలు అందించడంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. ప్రణీత సుభాష్‌ ఒక హాస్పిటాలిటీ కంపెనీలో భాగస్వామిగా ఉంది. బెంగుళూరులోని లావెల్లే రోడ్‌లో బూట్‌లెగర్‌ అనే రెస్ట్టారెంట్‌ను కూడా ఆమె నడుపుతుంది. సినిమా, వ్యాపారంలో రాణిస్తున్న ప్రణీతలో మరో కోణం ఉంది. రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన సేవానిరతిని చాటుకుంటోంది. అందుకోసం ప్రణిత ఫౌండేషన్‌ను స్థ్థాపించింది. బెంగళూరులో కొన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వాటికి మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశుద్థ్య సౌకర్యాలను అందించడం ద్వారా ఆమె కర్ణాటకలో ప్రభుత్వం విద్యను ఆధునీకరించే దిశగా కృషి చేస్తోంది.  కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ఉండే ఒక వృద్థాప్య ఆశ్రమం కోసం ఆమె నిధులు అందించింది. కరోనా సమయంలో ఎంతోమందికి అండగా నిలిచింది. ‘ఫ్రీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌’ చేపట్టింది. సమాజం కోసం తన వంతుగా సేవ చేస్తున్న ప్రణీత ఇప్పుడు మరో బిడ్డకు జన్మ ఇవ్వబోతుందని తెలియగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  

Updated Date - Jul 25 , 2024 | 03:07 PM