Prakash Raj: చక్కగా చెక్కిన శిల్పం.. అల్లు అర్జున్
ABN , Publish Date - Dec 06 , 2024 | 01:24 PM
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. అల్లు అర్జున్‌ని ప్రశంసలతో ముంచెత్తాడు. గంగోత్రి టు పుష్ప అంటూ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట ప్రస్థానం మొదలై రెండు దశాబ్దాలు గడుస్తుంది. 103 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకొని ఆయన ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే పుష్పలో ఫైర్ యాక్టింగ్ తో జాతీయ అవార్డు కొల్లగొట్టిన ఆయన 'పుష్ప 2'తో ఏకంగా నటవిశ్వరూపం చూపించారు. ఈ నేపథ్యంలో పలు భాషల్లో నటిస్తూ దేశంలోని గొప్ప నటుల జాబితాలో ఒకరిగా పేరును సుస్థిరం చేసుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. అల్లు అర్జున్ గురించి మాట్లాడారు.
ప్రకాష్ రాజ్- అల్లు అర్జున్ లది లాంగ్ అండ్ స్పెషల్ జర్నీ. డెబ్యూ మూవీ గంగోత్రి నుండి బన్నీ, పరుగు, బద్రీనాథ్, రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి సినిమాల్లో కలిసి నటించారు. తాజాగా 'పుష్ప 2' చూసిన ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ.. ' గంగోత్రి నుండి నీ ప్రయాణాన్ని చూస్తున్నాను. ఒక శిల్పాన్ని చెక్కినట్లు ఉండే, నీ జర్నీ ఎంతో గొప్పది. నిన్ను చూసి గర్వపడుతున్నాను' అంటూ బన్నీని ఉద్దేశించి రాశారు. అలాగే ఎప్పుడు సరిహద్దులు చెరిపేస్తూ ఉండు అన్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ కి, సుకుమార్ కి కూడా ప్రత్యేకంగా ప్రేమను చాటాడు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎర్రచందనం కూలీగా కెరీర్ మొదలుపెట్టి సిండికేట్‌ని, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు పుష్పరాజ్ (అల్లు అర్జున్). అధికార పార్టీకి సైతం ఫండ్ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. సీఎంను కలిసి వద్దామని పుష్ప బయలుదేరితే.. ‘వస్తూ వస్తూ సీఎమ్‌తో ఓ ఫొటో తీసుకుని రా’ అంటూ తన భార్య శ్రీవల్లి(రష్మిక) కోరిక కోరుతుంది. (రష్మిక). అయితే స్మగ్లర్లు పార్టీ ఫండ్ ఇచ్చేంత వరకే కానీ ఫొటోలు దిగడానికి కాదని అధికార సీఎం హేళనగా మాట్లాడతాడు. దానిని సీరియస్‌గా తీసుకున్న పుష్ప ఎంపీ సిద్దప్ప (రావు రమేష్)తో ఓ ఫొటో తీసుకొని, తననే ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు. అందుకోసం రూ.500 కోట్లు ఫండ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు. దాని కోసం 2000 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఆ స్మగ్లింగ్‌ని ఆపడానికి, తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజల్) ప్రయత్నాలు చేస్తాడు. భన్వర్ సింగ్ షెకావత్‌ని దాటుకొని ఆ 2000 వేల టన్నులు స్మగ్లింగ్ చేయగలిగాడా, లేదా? శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు? ఇంటి పేరు, కుటుంబం కోసం పాకులాడే పుష్పకు అది ఎలా దక్కింది? అన్నది కథ.