Pawan Vs Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్‌

ABN , Publish Date - Sep 24 , 2024 | 04:00 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానని ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానని ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు పోస్ట్‌ చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ ‘‘పవన్‌ కల్యాణ్‌ గారు.. ఇప్పుడే మీ ప్రెస్‌మీట్‌ చూశా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా  వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

అసలు విషయంలోకి వెళ్తే. ప్రస్తుతం దేశమంతా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ గురించి చర్చ నడుస్తోంది. రాజకీయ నాయకులు, హిందూ సంఘాలు, భక్తులు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయమై పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 20వ తేదిన ‘‘తిరుపతి బాలాజీ పవిత్ర ప్రసాదాన్ని కల్తీ చేయడం ఆలయ కమిటీ చేసిన ద్రోహం మరియు అతి పెద్ద పాపం. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్‌ చేయండి. ఈ విషయంలో హిందువులు తీవ్రంగా హర్టయ్యారు’’ అంటూ హిందూ ఐటీ విభాగం నుండి వచ్చిన ట్వీట్‌కు.. ‘‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బ తీసింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్ఘ్రభుత్వం కట్టుబడి ఉంది. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలి’’ అని పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు.  

పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌కు నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కౌంటరిస్తూ ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌లో.. ‘‘డియర్‌ పవన్‌ కళ్యాణ్‌.. ప్రస్తుతం లడ్డూ వివాదం జరుగుతున్న రాష్ట్రంలోనే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దయచేసి విచారణ జరపండి. ఈ విషయంలో తప్పు చేసింది ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించండి. అంతేకానీ, మీరు ప్రజల్లో భయాందోళనలను పెంచి, దీన్నో జాతీయ స్థ్థాయి సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు చాలానే ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.  

ఆలోచించి మాట్లాడండి...
మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ మెట్లను శుభ్రపరచి పసుపు రాసి బొట్టు పెట్టిన అనంతరం పవన్‌తో మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మం గురించి తక్కువ చేసే ప్రతి ఒక్కరిపై మండిపడ్డారు. గతంలో ప్రకాశ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రకాశ్‌రాజ్‌ మీరంటే గౌరవం ఉంది. దయచేసి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయవద్దు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఆలోచన లేకుండా మాట్లాడవద్దు. సెక్కులరిజానికి ఒకటే దారి లేదు. రెండు మార్గాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ఆచితూచి మాట్లాడాలి’’ అని అన్నారు. దానికి ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్‌ ఇస్తూ ఈ నెల 30 తర్వాత వచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తానన్నారు.

అలాగే పవన్‌కల్యాణ్‌ హీరో కార్తికు కూడా స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. సోమవారం జరిగిన సత్యం సుందరం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లడ్డూ ఇప్పుడు సున్నితమైన విషయం అని, దాని గురించి ఇప్పుడు మాట్లాడొద్దని అన్నారు. దానికి పవన్‌ స్పందించారు. "హీరోగా మీరంటే గౌరవం. ‘‘ఈ అంశపై మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి. లేకపోతే మౌనంగా ఉండండి. మీ మాఽధ్యమాల ద్వారా అపహాస్యం చేేస్త ప్రజలు క్షమించరు. ఇది ఎంతో బాధ కలిగీంచే అంశం. లడ్డూపై జోకులేస్తున్నారు. అది మంచి పద్దతి కాదు’’ అని పవన్‌ అన్నారు. దీనికి స్పందించిన కార్తి క్షమాపణ చెప్పారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 24 , 2024 | 04:12 PM