Director Apsar: ‘శివం భజే’ దర్శకుడిపై ప్రశంసలు

ABN , Publish Date - Aug 03 , 2024 | 07:36 PM

‘గంధర్వ’తో వినూత్నమైన యాంటీ ఏజింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు అప్సర్.. ఇప్పుడు అశ్విన్ బాబు హీరోగా నటించిన ‘శివం భజే’తో మరోసారి తన సత్తాను చాటారు. ఆగస్ట్ 1న విడుదలైన ఈ చిత్రం అంతటా పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ‘శివం భజే’ చిత్రం ఒక యూనిక్, డివోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా సక్సెస్‌తో దర్శకుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Shivam Bhaje Director Apsar

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ల హవా నడుస్తోంది. కొత్త కొత్త కాన్సెప్టులతో కొత్త దర్శకులు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలుస్తున్నారు. నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ ఇలా ఎంతో మంది యువ దర్శకులు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి మరో యువ దర్శకుడు కూడా చేరారు. ‘గంధర్వ’తో వినూత్నమైన యాంటీ ఏజింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు అప్సర్ (Apsar).. ఇప్పుడు అశ్విన్ బాబు హీరోగా నటించిన ‘శివం భజే’ (Shivam Bhaje)తో మరోసారి తన సత్తాను చాటారు. ఆగస్ట్ 1న విడుదలైన ఈ చిత్రం అంతటా పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ‘శివం భజే’ చిత్రం ఒక యూనిక్, డివోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.

Also Read- Buddy Movie Review: బడ్డీ మూవీ రివ్యూ

అశ్విన్ బాబు గత చిత్రం ‘హిడింబ’ సక్సెస్ సాధించడంతో.. ఆ సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఆ అంచనాలను రీచ్ అవుతూ.. మాస్‌ను మెప్పించే యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా అన్ని జానర్లను మిక్స్ చేసి తీసిన ‘శివం భజే’ సినిమా ఫుల్ పాజిటివ్ స్పందనతో ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది. దీంతో అంతా అప్సర్ దర్శకత్వం, మేకింగ్ గురించే మాట్లాడుకుంటుండటం విశేషం. ‘శివం భజే’ చిత్రంతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్, ఎంగేజ్ చేయడంలో అప్సర్ పాస్ అయ్యాడని ప్రశంసిస్తున్నారు. (Praises on Shivam Bhaje Director Apsar)


Apsar-Director.jpg

ఈ సినిమాతో అప్సర్ కాంప్లెక్స్ సబ్జెక్ట్‌లను కూడా ఎంతో సులభంగా, తన టాలెంట్‌తో తీయగలడని నిరూపించుకున్నారనేలా ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అతని రైటింగ్, మేకింగ్, టేకింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, మరో యంగ్ హీరోతో అప్సర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ని ప్లాన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘శివం భజే’ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి నిర్మించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించింది.

Read Latest Cinema News

Updated Date - Aug 03 , 2024 | 07:36 PM