Prabhas: బ్రహ్మ రాక్షసుడిగా ప్రభాస్.. డైరెక్టర్ ఎవరంటే

ABN , Publish Date - Nov 02 , 2024 | 02:09 PM

రాజా సాబ్, స్పిరిట్, హను రాఘవపూడి సినిమా, సలార్ 2, కల్కి 2 ఇలా ఐదు సినిమాల భారీ లైనప్ తో ప్రభాస్ 2026 చివరి వరకు ఎవరికీ కొత్తగా చిక్కేలా కనిపించడం లేదు. మరోవైపు చిన్న సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా సూపర్ సక్సెస్ సాధించిన ఓ డైరెక్టర్ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఈ డైరెక్టర్ ప్రభాస్‌ని ఒక నెగిటివ్ షేడ్‌లో చుపించాలనుకుంటున్నాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజా సాబ్, స్పిరిట్, హను రాఘవపూడి సినిమా, సలార్ 2, కల్కి 2 ఇలా ఐదు సినిమాల భారీ లైనప్ తో ప్రభాస్ 2026 చివరి వరకు ఎవరికీ కొత్తగా చిక్కేలా కనిపించడం లేదు. మరోవైపు చిన్న సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా సూపర్ సక్సెస్ సాధించిన ఓ డైరెక్టర్ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఈ డైరెక్టర్ ప్రభాస్‌ని ఒక నెగిటివ్ షేడ్‌లో చుపించాలనుకుంటున్నాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..


'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). ప్రస్తుతం 'జై హనుమాన్' తో పాటు 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'లో (pcvu) పలు సినిమాలు చేస్తున్నాడు. గతంలో ప్రశాంత్ వర్మ 'బ్రహ్మ రాక్షస' పేరుతో ఒక స్క్రిప్ట్ రాసుకొని ఒక బాలీవుడ్ హీరోకి నేరేట్ చేశాడు. కానీ.. ఆ సినిమా ఆరంభంలోనే ఆగిపోయింది. ఇదే స్క్రిప్ట్ తో ప్రశాంత్.. ప్రభాస్ ని కాంటాక్ట్ అయినట్లు సమాచారం. దీనికి ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అన్ని సవ్యంగా జరిగితే 2027లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.


ఇక ట్రూ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో చేతులు కలిపారు. ఈ ఎక్సయిటింగ్ న్యూ ప్రాజెక్ట్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి లీడ్ రోల్ పోషించనున్నారు. ఈ కొలాబరేషన్‌లో ‘జై హనుమాన్’ స్వరూపమే మారిపోయింది. ఇక ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో హనుమంతుడిగా చేస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు లీకయ్యాయి. మేకర్స్ దీవాళి స్పెషల్‌గా హనుమంతుడి పాత్రతో కూడిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. హనుమంతుడిగా మొదటి నుండి వినిపిస్తున్న రిషబ్ శెట్టినే ఫైనల్ చేశారు. ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపుని, నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి రాకతో ఈ సినిమాపై అంచనాలు డబుల్ కాదు త్రిబుల్ అయ్యాయని చెప్పొచ్చు.

Updated Date - Nov 02 , 2024 | 02:13 PM