Prabhas: కల్కి సక్సెస్‌పై ప్రభాస్‌ ఏమన్నారంటే!

ABN , Publish Date - Jul 15 , 2024 | 10:04 AM

'కల్కి 2898 ఎడి(Kalki 2898 Ad). చిత్రం సక్సెస్‌పై ప్రభాస్‌ స్పందించారు. నిర్మాణ సంస్థ విడుదల చేసిన వీడియోలో తన అభిమానులకు, దర్శకనిర్మాతలకు తోటి నటీనటులకు కృతజ్ఞతలు  చెప్పారు

'కల్కి 2898 ఎడి(Kalki 2898 Ad). చిత్రం సక్సెస్‌పై ప్రభాస్‌ స్పందించారు. నిర్మాణ సంస్థ విడుదల చేసిన వీడియోలో తన అభిమానులకు, దర్శకనిర్మాతలకు తోటి నటీనటులకు కృతజ్ఞతలు  చెప్పారు. ‘‘అభిమానులు లేకపోతే నేను జీరో(Thanks to Fans) . అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ నుంచి ఎంతో నేర్చుకున్నా. రెండో భాగం మరింత  భారీతనంతో ఉంటుంది. కల్కి మొదటి భాగానికి ఇంత భారీ విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు’’ అని ప్రభాస్‌ అన్నారు. నాగ్‌ అశ్విన్  దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించడమే కాక కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు చెబుతు ఓ వీడియో విడుదల చేసింది. (With out fans i am zero Said prabhas)

ప్రస్తుతం ‘కల్కి’ విజయాన్ని ఆస్వాదిస్తున్న ప్రభాస్‌ తదుపరి ఏ సినిమా కోసం రంగంలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. ‘సలార్‌ 2’, ‘కల్కి 2898 ఎ.డి’ రెండో భాగంతోపాటు హను రాఘవపూడి, సందీప్‌రెడ్డి వంగా తయారు చేసిన కథలు ప్రభాస్‌ డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. మరోవైపు మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’ చిత్రం సెట్స్‌పై ఉంది. వీటన్నింటినీ చేసుకురావాల్సి ఉంది. అయితే ఈ చిత్రాలు, అందులో పాత్రల గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.  హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా యుద్థం, ప్రేమ మేళవింపుగా ఉంటుందని, అందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. ఆ చిత్రానికి 'ఫౌజీ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.  

Updated Date - Jul 15 , 2024 | 10:37 AM