Prabhas: 'రాజా సాబ్' ఫ్యాన్ ఇండియా గ్లింప్స్

ABN , Publish Date - Jul 28 , 2024 | 05:04 PM

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి (Maruthi)దర్శకత్వంలో రూపొందిస్తున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" (Raja saab)నుంచి రెబల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి (Maruthi)దర్శకత్వంలో రూపొందిస్తున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" (Raja saab)నుంచి రెబల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను రేపు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. "రాజా సాబ్" సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది.

Raja-saab.jpg
"రాజా సాబ్" సినిమా ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ సోమవారం సాయంత్రం 5.03 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో వింటేజ్ కారు ముందు ప్రభాస్ పింక్ సూట్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. "రాజా సాబ్" సినిమాలో ప్రభాస్ లుక్, మేకోవర్ చాలా కొత్తగా ఉండబోతోంది. డార్లింగ్ ఫ్యాన్స్  ప్రభాస్ ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో, డైరెక్టర్ మారుతి అలా "రాజా సాబ్" మూవీని రూపొందిస్తున్నారు.  భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది.  'రాజా సాబ్' పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. 

Updated Date - Jul 28 , 2024 | 05:05 PM