Kalki2898AD: రికార్డులు బద్దలు కొడుతోన్న క‌ల్కి. బాక్సాఫీస్ ద‌మ్ము దులుపుతోన్న ప్ర‌భాస్‌

ABN , Publish Date - Jul 19 , 2024 | 06:36 AM

సినిమా విడుద‌లై దాదాపు నెల రోజులు కావ‌స్తున్నా క‌ల్కి చిత్రం జోరు తగ్గడం లేదు. జూన్ 27న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ ఇప్ప‌టికీ వరుస రికార్డులు సృష్టిస్తోంది.

kalki

సినిమా విడుద‌లై దాదాపు నెల రోజులు కావ‌స్తున్నా క‌ల్కి చిత్రం జోరు తగ్గడం లేదు. జూన్ 27న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ రిలీజైన‌ మొదటి రోజు నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకుని వరుస రికార్డులు సృష్టిస్తోంది ‘కల్కి 2898 ఏ.డీ’ సినిమా. ఇటీవలే రూ.1000 కోట్లు సాధించిన ఏడవ ఇండియన్‌ సినిమాగా.. రెండవ ప్రభాస్‌ సినిమాగా నిలిచింది. ఈ రికార్డుల వేటలో భాగంగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. రానున్న రోజుల్లో కల్కి మరికొన్ని రికార్డులను బద్దలు కొట్టనున్న‌ట్లు తెలుస్తోంది. రిపీట్ వాల్యూతో సినిమా లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Kalki 2898AD

తాజాగా కల్కి 2898 AD టిక్కెట్‌ పోర్టల్ Book My Show సేల్స్‌లో ఆల్-టైమ్ రికార్డ్ సృష్టించింది. టికెట్ బుకింగ్స్‌ అప్లికేషన్‌ ‘బుక్‌ మై షో’లో అత్యధిక టికెట్స్‌ బుక్‌ అయిన సినిమాగా ఖ్యాతి గడించింది. 12.15 మిలియన్స్‌ (దాదాపు రూ.1 కోటి 25 లక్షలు) టికెట్స్‌ బుక్‌ అయిన ఈ సినిమా అంతకుమందు ‘జవాన్‌’ సినిమా పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. ‘జవాన్‌’ 12.01 (దాదాపు రూ.1 కోటి 20 లక్షలు) మిలియన్స్‌ టికెట్‌ బుకింగ్స్‌తో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. మంగళవారం గవర్నమెంట్ హాలీడే కావడంతో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. నాల్గవ వీకెండ్ లో అద్భుతంగా పిక్ అప్ అవుతోంది, వీక్ డేస్ లో కూడా సినిమా చాలా స్టడీగా ఉంది. 21వ రోజు గెరువారం నాడు ఒక్క‌రోజే బుక్ మైషో యాప్ (Book my show) లో 128.35కే టికెట్స్ అమ్ముడవ‌డం విశేషం.


Kalki 2898AD

అదేవిధంగా.. నార్త్ అమెరికాలో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన రెండ‌వ భార‌తీయ‌ చిత్రంగా క‌ల్కి నిలిచింది. 18 మిలియ‌న్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించిన మూవీగా చ‌రిత్ర సృష్టించింది. కాగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌లో ప్రభాస్‌ ‘భైరవ’ పాత్రలో.. అమితాబ్‌ బచ్చన్‌ పురాణ యోధుడు ‘అశ్వత్థామ’గా.. కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రల్లో అలరించారు. ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్‌-2 తెరకెక్కనుందని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Updated Date - Jul 19 , 2024 | 06:36 AM