Prabhas: ప్రభాస్ మూవీకి బ్రేక్.. గాయం, విశ్రాంతి
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:21 PM
ప్రభాస్ గాయపడటంతో ఓ మూవీ షూటింగ్‌కి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభాస్ టీమ్ తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
హీరో ప్రభాస్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వచ్చే నెల జపాన్‌లో విడుదల కానున్న కల్కి ప్రమోషన్స్‌కు హాజరు కాలేకపోతున్న తెలిపారు. అలాగే ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మరో మూవీ షూటింగ్ కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రభాస్ టీమ్ ప్రకటించింది.
ప్రస్తుతం ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమాతో పాటు కల్కి 2, సలార్ 2, స్పిరిట్, హను రాఘవాపుడి సినిమాల షూటింగ్ లలో పాల్గొననున్నాడు. అయితే 'ది రాజా సాబ్' సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది కేవలం టాకీ పార్ట్ మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ఆ సినిమాకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. హను రాఘవాపుడి 'ఫౌజీ' షూటింగ్ కు మాత్రం బ్రేక్ పడినట్లు ప్రభాస్ టీమ్ తెలియజేసింది. అలాగే ఆయనకు జరిగిన గాయం ప్రమాదకరమైనదేమి కాదని తెలిపారు. త్వరలోనే షూటింగ్ లలో పాల్గొంటారని ప్రకటించారు.
మరోవైపు ప్రభాస్ కాలి చీలమండ కాస్త బెణికిందని దాని వల్ల కల్కి ప్రమోషన్ కార్యక్రమాలు క్యాన్సిల్ చేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. వచ్చే నెల 3న ఆయన 'కల్కి' రిలీజ్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లాల్సి ఉంది. కాలికి సమస్య రావడంతో ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ల టీమ్ జపాన్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుందని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు.