Salaar 2: సలార్2పై ఫేక్ న్యూస్.. చెడుగుడు ఆడుకుంటున్న ఫ్యాన్స్! ఒక్క ఫొటోతో చెక్
ABN , Publish Date - May 26 , 2024 | 01:05 PM
ఈ సోషల్ మీడియా ఉందే..ఫేక్ న్యూస్‌తో గబ్బు గబ్బు లేపులోందంటూ నెటిజన్లు బాగా ఫైర్ అవుతున్నారు. తాజాగా ప్రభాస్ సలార్ సినిమా విషయంలో ఇలాంటి న్యూసే ప్రచారమవడంతో మేకర్స్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మీ పెద్ద వాళ్లున్నారే.. మా ప్రేమను అసలు అర్ధం చేసుకోలేరు అన్న డైలాగ్ ఎంత ఫేమసో అందరికి తెలిసిందే. అచ్చం అలాగే ఈ సోషల్ మీడియా ఉందే..ఫేక్ న్యూస్‌తో గబ్బు గబ్బు లేపులోందంటూ నెటిజన్లు ఇప్పుడు బాగా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా సినిమాల విషయంలో అయితే ఈ షేక్ న్యూస్ చేసే రచ్చకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాజాగా ప్రభాస్ (Prabhas) సలార్ (Salaar) సినిమా విషయంలో ఇలాంటి ఘటనే జరగడంతో మేకర్స్ స్వయంగా రంగంలోకి దిగి స్పందించాల్సి వచ్చిందంటే ఈ న్యూస్ ఎంతగా ప్రచారం అయిందో అర్ధం చేసుకోవచ్చు.
విషయానికి వస్తే.. ఇటీవల సోషల్ మీడియాలో ఓ అకౌంట్ నుంచి సలార్ 2 (Salaar 2) సినిమా ఆగి పోయిందని ఇక పట్టా లెక్కదు అన్నట్టుగా సదరు నిర్మాత స్వయంగా వచ్చి వాళ్లకు ప్రత్యేకంగా చెప్పారా అన్న రీతిలో వాళ్లకు తోచిన నచ్చిన విధంగా రాసి పోస్టు చేశారు. ఇంకేముంది ఆ వార్తలో నిజం ఎంత అబద్దం ఎంతో తేల్చుకోకుండానే పోతే దొరకదు అన్నచందాన వాళ్లను ఫాలో అయ్యే వారు ఈ వార్తను తెగ షేర్ చేశారు. దీంతో ఒకటి రెండు రోజుల్లో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారమే రేపింది. ప్రభాస్ అభిమానులైతే అసలు ఏమౌతుందో అర్ధం కాక ఈ వార్త నిజమా అని అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో వాకబు చేశారు కూడా.
ఈ వార్త కాస్త సినిమా నిర్మాతల దృష్టికి పోవడంతో వారు ఖంగు తిని స్వయంగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ (Prabhas) , దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సలార్ సినిమా సెట్‌లో హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్న ఫొటోను విడుదల చేసి సినిమాపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టారు. ఆ ఫొటో కూడా మీ వార్తలకు మేం నవ్వుకుంటున్నాం అన్నట్లుగా ఉండడంతో సలార్ చిత్రంపై వస్తున్న వార్తలన్నీ రూమర్సేనని వాటిని నమ్మొద్దు అంటూ ఆ ఫొటోను రిలీజ్ చేసినట్లు అందరికి తెలిసి పోయింది. దీంతో ప్రభాస్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిని ట్యాగ్ చేసి మరీ ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యారు. బూతుల వర్షం కురిపించారు. ఇప్పుడు ఆ ఫొటో పాటు అభిమానుల రియాక్షన్ కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
అంతేగాక గత డిసెంబర్‌లో విడుదలైన సలార్ పార్ట్ 1 (Salaar) ప్రపంచవ్యాప్తంగా దాదాపు.రూ 750 కోట్టకు పైగా వసూళ్లు సాధించి అంత పెద్ద విజయం సాధిస్తే మెడకాయ్ మీద తలకాయ్ ఉన్నవాడు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారంటూ చెడుగుడు ఆడుకుంటున్నారు. సలార్ పార్ట్ 1తో ఓ స్థాయిలో లాభాలు రావడమే కాకుండా.. ఇప్పుడు ప్రపంచమంతా సలార్ (Salaar 2) పార్ట్ 2 ఎప్పుడొస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నదని అలాంటిది సినిమాను ఎందుకు సెల్వ్ చేస్తారంటూ ఫేక్ న్యూస్ సృష్టిస్తున్న వారికి చురకలు అంటిస్తున్నారు.