Mohan Babu: మోహన్ బాబుపై చర్యలు తప్పవ్.. సీపీ సుధీర్ బాబు

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:36 PM

మోహన్ బాబూ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. తాజాగా రాచకొండ సీపీ సుధీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నటుడు మోహన్‌ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈనెల 24 వరకు మోహన్‌బాబుకు కోర్టు గడువు ఇచ్చిందని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 24 తర్వాత మోహన్‌బాబుకు నోటీసులు ఇస్తామని, చట్టపరమైన చర్యలు ఉంటాయని సీపీ వెల్లడించారు.


మోహన్ బాబుకి వారం క్రితమే తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. హత్యాయత్నం కేసులో సోమవారం వరకు అరెస్ట్ చెయ్యొద్దని కోరుతూ బెయిల్ పిటిషన్ కోరారు మోహన్ బాబు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మోహన్ బాబు ఇక్కడే ఉన్నారనే విషయాన్ని అఫడవిట్ లో దాఖలు చేయాలని కోరింది. అప్పుడే ఏదైనా తేల్చుతాం అని తెలిపిన కోర్టు.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయగా సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది.

Updated Date - Dec 23 , 2024 | 03:36 PM