Tollywood: 'సీజ్ ది షిప్' సినిమా ఫిక్స్.. ఆ నిర్మాణ సంస్థ
ABN , Publish Date - Dec 04 , 2024 | 06:19 PM
పవన్ కళ్యాణ్.. ఆ పేరుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆయన నోటినుండి వచ్చిన డైలాగే ఇప్పుడు సినిమాగా మారనుంది.
ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పిన డైలాగ్ 'సీజ్ ది షిప్' ఇంటర్నెట్ లో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ పేరుతో అనేక పోస్టర్ లు నెట్టింట వెలిశాయి. అయితే ఈ టైటిల్ తో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది. ఈ ఐడియా మీలో చాలా మందికి స్ట్రైక్ అవ్వొచ్చు. కానీ.. ఓ నిర్మాణ సంస్థ ఆ ఐడియాని ఆల్రెడీ అమలు కూడా చేసేసింది. ఇంతకీ ఆ నిర్మాణ సంస్థ ఏం చేసింది. ఆ నిర్మాణ సంస్థ ఏంటంటే..
'సీజ్ ది షిప్' ప్రస్తుతం సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవల కాకినాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బియ్యం లోడవుతున్న ఓ నౌకను సీజ్ చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈ డైలాగ్ బయటకొచ్చింది. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ ‘సీజ్ ది షిప్’ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నారు. ఈ టైటిల్ కోసం రూ. 1,100 చెల్లించి ఏడాది వరకు పేటెంట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు నటిస్తారన్నది ఆసక్తిగా మారింది.
ఇక ‘హరి హర వీరమల్లు’ సినిమా విషయానికొస్తే.. చారిత్రక అంశాలతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవన్ శక్తిమంతమైన యోధుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరపైకి రానుండగా.. మొదటి భాగాన్ని ‘హరి హర వీరమల్లు పార్ట్–1 స్వ్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో మార్చి 28న విడుదల కానుంది. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, నాజర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. క్రిష్ పర్యవేక్షణలో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.