Neha Shetty: ఓజీలో స్పెషల్ సాంగ్.. క్రేజీ హీరోయిన్
ABN , Publish Date - Dec 18 , 2024 | 07:29 PM
ఓ క్రేజీ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో స్పెషల్ పర్ఫామెన్స్ ఇయ్యనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ హీరోల హార్ట్ బ్రేక్ చేసే ఆ హీరోయిన్ ఎవరంటే..
పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓజీ'. ఇది పవన్ సైన్ చేసిన ఆఖరి సినిమా అయినా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ దూసుకుపోతుంది. ఇక అన్నిటికంటే ముందే స్టార్ట్ అయినా 'హరిహర వీరమల్లు’ కాస్త నిదానంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో 'హరిహర వీరమల్లు’ కన్నా ముందే ‘ఓజీ’ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఓ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
పవన్ కళ్యాణ్ 'ఓజీలో' సుజీత్ ఓ ఐటెం నంబర్ ప్లాన్ చేయనున్నట్లు టాక్. అందులో డీజే టిల్లు ఫేమ్ రాధికా అలియాస్ నేహా శెట్టి కనిపిస్తారని అంటున్నారు. అయితే ఈ సాంగ్ లో పవన్ ఉంటాడా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. సుజీత్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఓజీ’ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. సినిమా దాదాపు 80 శాతం చిత్రీకరణ అయిపోయింది అని చెబుతున్నారు. అందుకే ప్రమోషన్స్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట. ఈ నేపథ్యంలోనే తొలి గీతాన్ని చూపించి, వినిపించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
మరోవైపు ఈ సినిమా కోసం స్పెషల్ టీమ్ పని చేస్తోంది అని ఇప్పటికే తమన్ చెప్పారు. మరి ఆ స్పెషల్ మ్యూజిక్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది.