Pawan Kalyan: ఆపద్బాంధవుడు  అన్నయ్య.. పవన్ శుభాకాంక్షలు!

ABN , Publish Date - Aug 22 , 2024 | 09:32 AM

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు.

Chiranjeevi and Pawan Kalyan


మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan)శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. ‘‘నా దృష్టిలో ఆపద్బాంధవుడు  అన్నయ్య చిరంజీవి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు ఎన్నో. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు.. అభ్యర్థిస్తారు.  ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో. (Ap deputy Cm pawan kalyan wishes to Chiranjeevi)

Chiranjeevi.jpg

గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో రూ.ఐదు కోట్ల విరాళాన్ని  జనసేన పార్టీకి అందజేసి విజయాన్ని అందుకోవాలని మా ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారు. ఆయన ఆ రోజు ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తల్లిలాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుడిని మనసారా కోరుకుంటున్నా’’ అని పవన్‌ పేర్కొన్నారు. పుట్టినరోజు సందర్భంగా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చిరంజీవి దంపతులు.   

pk.jpg

Updated Date - Aug 22 , 2024 | 09:34 AM