Pawan Kalyan: పవన్‌ గానం.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణ

ABN , Publish Date - Sep 29 , 2024 | 10:53 AM

పవన్‌కల్యాణ్‌లో (Pawan Kalyan) మంచి సింగర్‌ కూడా ఉన్నారు. ఆయన మంచి గాయకుడు అని ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు.

పవన్‌కల్యాణ్‌లో (Pawan Kalyan) మంచి సింగర్‌ కూడా ఉన్నారు. ఆయన మంచి గాయకుడు అని ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు. తమ్ముడు’, 'పంజా’, ‘ఖుషి’,'అత్తారింటికి దారేది’, 'అజ్ఞాతవాసి’ ఇలా చాలా చిత్రాల్లో ఆయన గొంతు సవరించుకుని మైక్‌ ముందుకొచ్చారు. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’(Harihara Veeramallu) కోసం కూడా ఆయన ఓ పాట పాడినట్లు తెలుస్తోంది. కీరవాణి స్వరకల్పనలోని ఆ పాటను ఇప్పటికే పవన్‌కల్యాణ్‌ ఆలపించడంతోపాటటు, చిత్రీకరణ కూడా పూర్తి చేశారని, అది సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుందని సన్నిహితులు నుంచి సమాచారం. (pawan sings for HHVM)

Hhmv.jpg

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ ఇటీవలే పునః ప్రారంభమైంది. విజయవాడలో వేసిన సెట్‌లో  కీలక పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన పర్యవేక్షణలో జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఏఎమ్‌ రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. బాబీ డియోల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.  వచ్చే ఏడాది మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Updated Date - Sep 29 , 2024 | 10:53 AM