Pawan Kalyan Producers: అభిమానులు అర్థం చేసుకోండి!

ABN , Publish Date - Sep 02 , 2024 | 01:49 PM

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) పుట్టినరోజును పురస్కరించుకుని తాజా చిత్రాల అప్‌డేట్‌ ఇస్తామని ఆయా చిత్రాల నిర్మాణ సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే! తాజాగా వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిపాయి.

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) పుట్టినరోజును పురస్కరించుకుని తాజా చిత్రాల అప్‌డేట్‌ ఇస్తామని ఆయా చిత్రాల నిర్మాణ సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే! తాజాగా వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేడు విడుదల కావాల్సిన అప్‌డేట్స్‌ను క్యాన్సిల్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.  

పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ (OG). ఈ సినిమా నుంచి పవన్‌ పుట్టినరోజు నాడు అప్‌డేట్స్‌ (Movie Updates Cancel) ఇస్తామని ఇటీవల డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ప్రకటించింది. తాజాగా దాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.  ‘ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వరాలకు ప్రజలు  తీవ్ర ఇబ్బందుకు పడుతున్నారు. వరదల కారణంగా బర్త్‌డే కంటెంట్‌ రిలీజ్‌ను రద్దు చేస్తున్నాం. ‘ఓజీ’ సినిమా కొన్నేళ్ల పాటు సెల్రబేట్‌ చేసుకునేలా ఉంటుంది. మనందరం కలిసి ఈ విపత్కర పరిస్థితులను అది?గమించి.. త్వరలోనే భారీ సెలబ్రేషన్స్‌ చేసుకుందాం’ అని పేర్కొంది. ఈ మేరకు పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేయడం లేదని తెలిపింది.

ప్రజలు కష్టాల్లో ఉన్నారని వద్దనుకున్నాం..

పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈరోజు పవన్‌ పుట్టినరోజు సందర్భంగా  కొత్త పోస్టర్‌ విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. దీనిని కూడా క్యాన్సిల్‌ చేశారు. ‘పవన్‌ ఫ్యాన్స్‌ కోసం ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ డిజైన్‌ చేశాం. దాన్ని ఈరోజు రిలీజ్‌ చేద్దామని అనుకున్నాం. ప్రస్తుతం తీవ్రమైన వరదలతో తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు  ఉన్నాయి. ఈ సమయంలో పోస్టర్‌ రిలీజ్‌ చేయడం సరికాదని భావిస్తున్నాం. అందరూ అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం’’ అని టీమ్‌ ప్రకటించింది. ఈ సినిమాకు మొదట క్రిష్‌ దర్శకత్వం వహించగా.. ఇటీవలే ఆయన ఈ సినిమా నుంచి వైదొలగినట్లు టీమ్‌ ప్రకటించింది. ప్రస్తుతం ఈ చిత్రం దర్శకత్వం బాధ్యతలను ఏఎం జ్యోతికృష్ణ తీసుకున్నారు. ఏ.ఎం రత్నం నిర్మాత. 

Updated Date - Sep 02 , 2024 | 01:51 PM