'ఓజీ అప్‌డేట్ ఇచ్చి చావు’.. 'సీజ్ ద షిప్' అంటూ జవాబు
ABN , Publish Date - Dec 01 , 2024 | 05:10 PM
ఎక్స్‌లో ఓ సరదా సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా అప్‌డేట్ కోరుతూ ఓ నెటిజన్.. ‘‘ఓజీ అప్‌డేట్ ఇచ్చి చావు’’(Og Update ichi Chavu) అని పోస్ట్ పెట్టాడు.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతిలో ప్రస్తుతం మూడు చిత్రాలున్నాయి. 'ఓజీ'(OG), 'ఉస్తాద్ భగత్‌సింగ్'(Ustaad Bhagath singh), 'హరిహర వీరమల్లు' (harihari Veeramallu) చిత్రాలు సెట్స్ మీదున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ వీలు కుదిరిస ప్రతిసారి డేట్లు సర్దుబాటు చేసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా 'హరిహర వీరమల్లు' చిత్రం షూటింగ్ విజయవాడలో మొదలైంది. అందులో పవన్‌కల్యాణ్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. దీంతో పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తున్నారు. ఓజీ అప్‌డేట్ (OG update) కావాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ మేరకు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌లో ఓ సరదా సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా అప్‌డేట్ కోరుతూ ఓ నెటిజన్.. ‘‘ఓజీ అప్‌డేట్ ఇచ్చి చావు’’(Og Update ichi Chavu) అని పోస్ట్ పెట్టాడు.
దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. ‘‘అప్‌డేట్‌లు ఇవ్వకుండా చావనులే. ఉన్నప్పుడు ఇస్తా. ప్రస్తుతానికి సీజ్ ది షిప్’’ అని రిప్లై ఇచ్చింది. మరో పోస్టులో ‘‘మీరేంట్రా వారానికి ఒకసారి’’ అని పేర్కొంది. ఎన్నికల ముందు పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా ఎంతగా ఫేమస్ అయిందో.. ఇప్పుడు కాకినాడ పోర్టులో పవన్‌కల్యాణ్ అన్న ‘సీజ్ ది షిప్’ ఆన్‌లైన్‌లో అంతకుమించి వైరల్ అయింది. ఆ మాటలను కూడా ఈ సినిమాలో ఉపయోగించమని అభిమానులు కోరుతున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఓజీ’ తెరకెక్కుతోంది. ప్రియాంకా మోహనన్ కథానాయిక. శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరకర్త. శింబు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పాడనున్నారు.