Pawan Kalyan : ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:43 PM

పవన్  కల్యాణ్‌కు సంబంధించి ప్రతి విషయం, వేసే ప్రతి అడుగు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన ఫొటో, వీడియో ఏది బయటకు వచ్చినా విపరీతంగా మిలియన్ల వ్యూస్‌తో వైరల్‌ అవుతోంది.

Pawan Kalyan : ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట


పవన్  కల్యాణ్‌కు (Pawan kalyaN) సంబంధించి ప్రతి విషయం, వేసే ప్రతి అడుగు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన ఫొటో, వీడియో ఏది బయటకు వచ్చినా విపరీతంగా మిలియన్ల వ్యూస్‌తో (Family photo) వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియా స్టేటస్‌, షేర్లతో రచ్చరచ్చ జరుగుతోంది.  తాజాగా ఆయనకు సంబంధించిన మరో ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోను జనసేన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. పవన్  కల్యాణ్‌, అన్నాలెజినవో, (Anna leznova) అకీర నందన, ఆద్యా ఈ ఫొటోలో ఉన్నారు.

"ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తరవాత క్లిక్‌ అనిపించిన అందమైన ఫోటో ఇది. ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయలుదేరాలనుకొంటే - ట్రాఫిక్‌ చిక్కులు ఏర్పడ్డాయి. తన కారుని రోడ్డు పక్క నిలిపి సేద తీరిన క్షణంలో సతీమణి అన్నా లెజినవా, పిల్లలు అకీరా నందన్‌, ఆద్యలతో తీసుకున్న ఫొటోను జనసేన పార్టీ ట్విట్టర్‌లో షేర్‌ చేయగా విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోను చూసిన అభిమానులు ట్రెండ్‌కే ట్రెండ్‌, పవన్  ఏం చేసినా ట్రెండ్‌సెట్‌ చేస్తుందని కామెంట్స్‌ చేస్తోంది.

జనసేన పార్టీ నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్‌కు కౌంటర్స్‌ ఇస్తున్నారు నెటిజన్లు. 'పిఠాపురంలో పవన కల్యాణ్‌ కొత్త ఇంటి గృహ ప్రవేశానికి దమ్ముంటే తన భార్య అన్నా లెజినవాను తీసుకురమ్మనండి’ అంటూ పోతిన సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. పవన్  గెలిచిన క్షణం నుంచి అన్నా.. తన భర్త పవన్ తోనే ఉంది. ఇప్పుడు ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి పోతినకు టార్గెట్‌ చేస్తు కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు, అభిమానులు.

Updated Date - Jun 23 , 2024 | 03:47 PM