Rajendra Prasad: పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యం రాజేంద్రుడికి ఆ దేవుడు ఇవ్వాలి
ABN , Publish Date - Oct 05 , 2024 | 10:27 AM
పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని రాజేంద్రప్రసాద్‌కి ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. గాయత్రి మరణ వార్త తెలిసిన ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. రాజేంద్రప్రసాద్‌కు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.
పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని రాజేంద్రప్రసాద్‌కి ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో చనిపోయారు. శుక్రవారం రాత్రి కార్డియాక్ అరెస్టుతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో గాయత్రి (Gayathri) కన్నుమూశారు. ఆమెకు తీవ్ర గ్యాస్ట్రిక్ సమస్య రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఆమె హార్ట్ ఎటాక్‌కు గురై కన్నుమూశారు. గాయత్రి మరణ వార్త తెలిసిన ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. రాజేంద్రప్రసాద్‌కు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.
Also Read- Rajendra Prasad: నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె మృతి.. విషయం ఏమిటంటే
సీనియర్ నటుడు శ్రీ రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులోనే అకాల మరణానికి గురికావడం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయత్రి ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుడిని కోరుకుంటున్నాను. - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు
రాజేంద్రప్రసాద్‌గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్రప్రసాద్‌గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని రాజేంద్రప్రసాద్‌గారికి ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan)
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌గారి కుమార్తె గాయత్రి మృతి బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. -నారా లోకేష్
నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్‌గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - జూ ఎన్టీఆర్ (Jr NTR)
నాకు అత్యంత ఆప్తులు శ్రీ రాజేంద్రప్రసాద్ గారి కూతురు గాయత్రి గారి హఠాన్మరణం మనసును ఎంతో కలిచివేసింది. కూతురులోనే అమ్మను చూసుకున్న ఆయనకు ఇలాంటి కష్టం రావడం అత్యంత బాధాకరం. ఆయనకు నా ప్రగాఢ సంతాపం. ఈ కష్ట సమయాన్ని తట్టుకుని నిలబడే మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని దేవుడు ఆయన కుటుంబానికి ఇవ్వాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. -సాయిధరమ్ తేజ్
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి ఆకస్మిక మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. రాజేంద్రప్రసాద్ అన్నయ్యకు ఆ భగవంతుడు ఈ బాధను తట్టుకునే మనో దైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని వేడుకుంటున్నాను. -నటుడు అలీ