Parasuram: వాట్ నెక్స్ట్ పరుశురాం.. హీరో అతనేనా
ABN , Publish Date - Oct 07 , 2024 | 01:40 PM
'ఫ్యామిలీస్టార్’ తర్వాత పరశురామ్ సినిమా ఏంటన్న చర్చ కొంతకాలంగా జరుగుతోంది.
'ఫ్యామిలీస్టార్’ (Family star) తర్వాత పరశురామ్ ((Parasuram)సినిమా ఏంటన్న చర్చ కొంతకాలంగా జరుగుతోంది. ఇప్పటికే ఆయన కార్తి కోసం ఓ కథ రెడీ చేసుకొన్నారు. గతంలో కూడా ఈ విషయాన్నీ అయన చెప్పారు. అయితే… ఎందుకనో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డతో (Siddu Jonnalagadda) సినిమా చేయడానికి దాదాపుగా రంగం సిద్ధమైందన్నది టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు బ్యానర్లో ఈ చిత్రం రూపొందించే అవకాశాలు ఉన్నాయి. సిద్దు జొన్నలగడ్డతో దిల్ రాజు ఓ సినిమా చేయాలని ఒక కమిట్మెంట్ ఉంది. అడ్వాన్స్ కూడా ఇచ్చారని సన్నిహితుల నుంచి సమాచారం. ‘ఫ్యామిలీస్టార్’ చేసేటప్పుడే దిల్ రాజు కాంపౌండ్ లో మరో సినిమా చేయడానికి పరశురామ్ అంగీకరించారని టాక్.
అయితే కార్తి కోసం అనుకొన్న కథే… ఇప్పుడు సిద్దుతో చేస్తున్నారా? లేదంటే ఆ కథని పక్కన పెట్టి కొత్త కథతో ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నారా? అన్నది తే;ఇయాల్సి ఉంది. సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ‘తెలుసు కదా’ అనే మరో ప్రాజెక్టు నడుస్తోంది. ఇవి రెండూ దాదాపుగా పూర్తి కావచ్చాయి. వీటి తరవాతే.. పరశురామ్ దర్శకత్వంలో సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.