Pagal Vs Kadal: ఆగష్టు 9న థియేట‌ర్ల‌లోకి.. ‘పాగల్ వర్సెస్ కాదల్’

ABN , Publish Date - Aug 06 , 2024 | 09:40 PM

విజయ్ శంకర్, విషిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా పాగల్ వర్సెస్ కాదల్. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 9న విడుద‌ల కానుంది.

Pagal Vs Kadal

విజయ్ శంకర్ (Vijay Shankar), విషిక (Vishika) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా పాగల్ వర్సెస్ కాదల్ (PagalVsKadal). ఈ చిత్రాన్ని శివత్రి ఫిలింస్ బ్యానర్ పై పడ్డాన మన్మథరావు నిర్మిస్తున్నారు. రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మాజీ, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "పాగల్ వర్సెస్ కాదల్" సినిమా ఈ నెల 9న విడుద‌ల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

p.jpg

ఈ సంద‌ర్భంగా హీరో విజయ్ శంకర్ (Vijay Shankar) మాట్లాడుతూ.. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా మీ ముందుకు వస్తోంది. ఈ సినిమాలో నేను కార్తీక్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. సినిమా ప్రేమలో ఉన్న ప్రతి లవర్ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ప్రియ పాత్రలో విషిక అద్భుతంగా నటించింది. ఈ నెల 9న థియేటర్స్ లోకి వస్తున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.


WhatsApp Image 2024-08-06 at 5.14.39 PM.jpeg

హీరోయిన్ విషిక (Vishika) మాట్లాడుతూ.. పాగల్ వర్సెస్ కాదల్ సినిమాలో నేను ప్రియ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. నా క్యారెక్టర్ చూసి మేము మా బాయ్ ప్రెండ్స్ ను ఇంతగా ఇబ్బంది పెడుతామా అని అమ్మాయిలు అనుకుంటారు. నేను నటించిన కమిటీ కుర్రాళ్లు సినిమాతో పాటు పాగల్ వర్సెస్ కాదల్ కుడా ఒకే డేట్ కు ఈ నెల 9న రిలీజ్ అవుతున్నాయి. నా కెరీర్ లో మర్చిపోలేని సందర్భం ఇది. మా పాగల్ వర్సెస్ కాదల్ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా అని చెప్పారు.

Updated Date - Aug 06 , 2024 | 09:40 PM