OTT and Theatre movies: ఈ వారం సందడి ఈ చిత్రాలదే
ABN , Publish Date - Jan 01 , 2024 | 04:41 PM
పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి.. నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. కొత్త సంవత్సరంలో కొత్త తరహా కథలు చూడాలనుకుంటాం. సినీ ప్రియుల కోసం అటు థియేటర్లు, ఇటు ఓటీటీ మాధ్యమంలో సందడి చేయడానికి పలు చిత్రాలు సిద్ధమయ్యాయి,
పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి.. నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. కొత్త సంవత్సరంలో కొత్త తరహా కథలు చూడాలనుకుంటాం. సినీ ప్రియుల కోసం అటు థియేటర్లు, ఇటు ఓటీటీ మాధ్యమంలో సందడి చేయడానికి పలు చిత్రాలు సిద్ధమయ్యాయి,
నాని హీరోగా శౌర్యువ్ తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘హాయ్ నాన్న. ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్థమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 4 నుంచి సీ్ట్రమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. నాని సరసన మృణాల్ ఠాకూర్ నటించిన ఈ చిత్రంలో బేబీ కియారా, శ్రుతిహాసన్, ప్రియదర్శి ఇతర పాత్రలు పోషించారు.
గాయని సునీత తనయుడు ఆకాశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మించిన చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకుడు. భావన వళపండల్ కథానాయిక. నూతన సంవత్సరంలో ఒకటో తేదిన ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. ‘కథ ప్రధానంగా సాగే చిత్రమిది. యథార్థ ఘటనల స్ఫూర్తితో 90వ దశకం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించాం. అప్పటి గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరంగా కథా, కథనాలు ఉంటాయి. వాస్తవికతకు ఈ మూవీ అద్దం పడుతుంది’ అని చిత్ర బృందం తెలిపింది.
రాఘవరెడ్డి కథ:
శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత కీలక పాత్రధారులుగా నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తుంది. కొత్త కాన్సెప్ట్‌తో పాటు ఎమోషనల్ డ్రామాతో నవసరాలతో ఈ చిత్రం రూపొందింది. పోలీసులకు సైతం అంతుచిక్కని నేరాలపై పరిశోధన చేసే క్రిమినాలజీ ప్రొఫెసర్ పాత్రను శివ పోషిస్తున్నారు.
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!
అందమైన కథగా.. #90s'
‘మన కోసం మనతో కొట్లాడి నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ..’ అని చెబుతున్నారు శివాజీ. ఆయన కీలక పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ ‘90’ (ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’బీ). వాసుకి ఆనంద్, మౌళి, వసంతిక, రోహన్, కీలక పాత్రధారులు. ఆదిత్య హసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్’వేదికగా స్ర్టీమింగ్ అయ్యేందుకు సిద్థమైంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు చక్కని స్పందన వచ్చింది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు- సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
జనవరి 01: బిట్‌కాన్డ్ (హాలీవుడ్)
జనవరి 01: ఫూల్ మీ వన్స్ (వెబ్‌సిరీస్)
ది బ్రదర్స్ సన్ (వెబ్‌సిరీస్)
జనవరి 05: కన్జూరింగ్ కన్నప్పన్’ (చిత్రం)
జనవరి 05: గుడ్ గ్రిఫ్ (హాలీవుడ్)
అమెజాన్ ప్రైమ్
డిసెంబరు 31: టైగర్ (హిందీ)
జనవరి 1: మారీ మై హజ్బెండ్ (కొరియన్)
జియో సినిమా
జనవరి 03: మెగ్2: ది ట్రెంచ్ (హాలీవుడ్)
జీ5
జనవరి 05: తేజస్ (హిందీ)
సోనీలివ్
జనవరి 05: క్యూబికల్స్ (హిందీ)