Om Shivam: యధార్థ సంఘటనతో మూడు భాషల్లో ‘ఓం శివం’
ABN , Publish Date - Sep 08 , 2024 | 06:19 PM
భార్గవ కృష్ణ హీరోగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వాస్తవిక కథాంశంతో మూడు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ఓం శివం . వైరాగ్యంలో ఉన్న ఓ శివ భక్తుడి జీవితంలో జరిగే కొన్ని అనూహ్య సంఘటనలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.
భార్గవ కృష్ణ (Bhargav Krishna) హీరోగా పరిచయం చేస్తూ.. దీపా మూవీస్ బ్యానర్( Deepa Movies banner)పై కె. ఎన్. కృష్ణ. కనకపుర (K.N. Krishna Kanakapura) నిర్మాతగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వాస్తవిక కథాంశంతో మూడు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ఓం శివం (Om Shivam). ఈ సినిమాలో విరానిక శెట్టి (Viranika Shetty) కథానాయికగా నటించగా ఆల్విన్ (Alwin) దర్శకత్వం వహించారు. రవి కాలే, రోబో శంకర్, కాక్రోచ్ సుధి, యాష్ శెట్టి, లక్ష్మి సిద్ధయ్య, అపూర్వ శ్రీ బల్‌రాజ్‌వాడి, ఉగ్రమ్ రవి, వరదన్, రోబో గణేశ్ తదితరులు ఇతర పాత్రలను పోషించారు.
తాజాగా ఈ మూవీ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. వైరాగ్యంలో ఉన్న ఓ శివ భక్తుడి జీవితంలో జరిగే కొన్ని అనూహ్య సంఘటనలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఓం శివం (Om Shivam) చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని తెలిపారు. దర్శకుడు ఆల్విన్ మాట్లాడుతూ.. హీరో భార్గవ కృష్ణకి ఇది మొదటి సినిమా అయినా చాలా బాగా నటిస్తున్నాడని, అదేవిధంగా చిత్ర కథ, సంగీతం, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు.
ప్రస్తుత కాలంలో ప్రేమ ఒక వన్‌సైడ్ అయినప్పటికీ దాన్ని వెంటనే వ్యక్తం పరుస్తున్నారు. ప్రేమను వ్యక్తం చేసిన వారు వెంటనే ఆ ప్రేమను తిరస్కరిస్తే జీర్ణించుకోలేక పోతున్నారు. 19 నుంచి 20 యేళ్ళ యువకుడు ఒక హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. ప్రేమ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే హీరో జీవితంలో సడెన్ ట్విస్ట్. ప్రియురాలు చనిపోతుంది.
దీంతో ఆ యువకుడి జీవితం గాడి తప్పుతుంది. చనిపోతాడు కూడా. ఆ తర్వాత చనిపోయిన ప్రియుడు ఎలా బతికాడు? అతడి ప్రేమను మళ్ళీ దక్కించుకున్నాడా? లేదా అన్నదే ఈ చిత్ర కథ. దీన్ని యాక్షన్‌తో విభిన్న కోణంలో చెప్పాం’ అన్నారు. ఈస్ట్ గోదావరి, మాండ్య, పుదుచ్చేరి, మైసూర్, తళి, కృష్ణగిరి వంటి ప్రాంతాల్లో 45 రోజుల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇదిలాఉంటే, నిర్మాత కృష్ణ ఎన్‌కే తన బ్యానరుపై నాలుగు చిత్రాలను నిర్మిస్తుండగా, వాటిలో తొలి ప్రాజెక్టు ఈ ‘ఓం శివం’ చిత్రం.