Kalki 2898 AD: హ‌మ్మ‌య్యా.. ‘కల్కి 2898 ఏడీ’ టికెట్ల రేట్లు త‌గ్గిన‌య్‌! కానీ

ABN , Publish Date - Aug 02 , 2024 | 11:26 AM

ప్ర‌భాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుద‌లై నెల దాటినా ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే రూ.1100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. తాజాగా సినీ ప్రియుల కోసం చిత్ర నిర్మాణ సంస్థ టికెట్ల రేట్ల‌ను త‌గ్గింస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.. కానీ

kalki

అలిండియా సూప‌ర్‌స్టార్ ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం విడుద‌లై నెల రోజులు దాటినా దాని ప్ర‌భావం అస‌లే మాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ మాసం రోజుల్లో ఇర‌వై , ముప్పై సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ స్టిల్ క‌లెక్ష‌న్లను రాబ‌ట్టుకుంటోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1100కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన ఈ మూవీ అనేక రికార్టుల‌ను నెల‌కొల్పుతోంది.

Kalki.jpg

ఇప్ప‌టికే ఈ సంత్స‌రం అత్య‌ధిర వ‌సూళ్లు రాబ‌ట్టిన ఇండియ‌న్ చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిల‌వ‌గా ఈ ఘ‌న‌త సాధ‌ఙంచిన ఎనిమిదవ భార‌తీయ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాదు నార్త్ అమెరికా (19.5మిలియన్‌ డాలర్లు, నేపాల్ (రూ. 25 కోట్లు) , మ‌రో రెండు మూడు దేశాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన ఏకైక చిత్రంగా నిల‌వ‌డం గ‌మ‌నార్హం.


GT55177b0AE6Rv4.jpeg

ఇదిలాఉండ‌గా సినిమా విడుద‌లై 7వ వారంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్ర యూనిట్ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సినీ అభిమానుల కోసం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. క‌ల్కి సినిమా ప్ర‌ద‌ర్శిత‌మవుతున్న అన్ని థియేట‌ర్ల‌లో టికెట్ల రేట్ల‌ను కుదించింది. రూ. 100కే మూవీని చూడొచ్చంటూ త‌న సోష‌ల్ మీడియా పోస్టు ద్వారా ప్ర‌క‌టించింది. ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ తగ్గింపు ధ‌ర‌లు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. కాకుంటే కొన్ని ష‌ర‌తులు ఉంటాయ‌ని పేర్కొంది.

Updated Date - Aug 02 , 2024 | 11:26 AM