O Manchi Ghost: జూన్ 14న థియేట‌ర్ల‌లోకి.. ‘ఓ మంచి ఘోస్ట్’

ABN , Publish Date - Jun 06 , 2024 | 09:21 PM

ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చేందుకు రెడీ అయింది.

O Manchi Ghost: జూన్ 14న థియేట‌ర్ల‌లోకి.. ‘ఓ మంచి ఘోస్ట్’
o manchi ghost

హారర్, కామెడీ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆధరణ ఎప్పుడూ ఉంటుంది. థియేటర్లో అయినా,ఓటీటీలో అయినా ఈ జానర్‌ను ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే హారర్, కామెడీ చిత్రాలను తెరకెక్కించేందుకు మేకర్లు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ (Shankar Marthand) దర్శకత్వంలో ‘ఓ మంచి ఘోస్ట్’ (O Manchi Ghost)అనే చిత్రం రాబోతోంది.

GNN0aR8W0AA1IP1.jpeg

ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore), నందితా శ్వేత (Nandita swetha), షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. డా.అబినికా ఇనాబతుని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం నిర్మించగా.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్‌, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


FuTKhWsWIAYMY19.jpeg

‘ఓ మంచి ఘోస్ట్’ (OManchiGhost) సినిమాకు సంబంధించిన విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. జూన్ 14న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్ వంటి వారు కనిపిస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమా ఆద్యంతం నవ్విస్తూ, భయపెట్టేలా కనిపిస్తోంది.

Updated Date - Jun 06 , 2024 | 09:40 PM