Ali: అక్రమ నిర్మాణాలు.. అలీకి నోటీసులు
ABN , Publish Date - Nov 24 , 2024 | 05:45 PM
తన ఫామ్ హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న సినీ నటుడు అలీకి (Ali) అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎక్‌మామిడి గ్రామంలో అలీకి ఫామ్ హౌస్ ఉంది.
తన ఫామ్ హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న సినీ నటుడు అలీకి (Ali) అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎక్‌మామిడి గ్రామంలో అలీకి ఫామ్ హౌస్ (Notices To Actor Ali) ఉంది. అందులో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లుగా గుర్తించి స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఎక్‌మామిడి రెవెన్యూ పరిధి సర్వే నెంబరు 345లోని ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలకు సంబంధించి పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలంటూ గతంలోనే అలీకి నోటీసులు ఇచ్చారు. ఆయన స్పందించకపోడంతో తాజాగా మళ్లీ రెండోసారి పంచాయతీ కార్యదర్శి శోభారాణి నోటీసులు జారీ చేశారు. సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించి అనుమతులు పొందాలని సూచించారు. లేని పక్షంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోరని ఫామ్ హౌస్‌లోకి (Ali Farmhouse) ఎవరూ రారు అనుకుని అలీ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చూసి చూడనట్లుగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. మామూలుగా శాశ్వత కట్టడాలు కాకపోతే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ అలీ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే దీనిపై ఆలీ తన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మాత్రం దానికి లాయర్ల వరకూ వెళ్లాల్సిన అవసరం లేదని పర్మిషన్ డాక్యుమెంట్స్ చూపిస్తే చాలని, ఒక వేళ అనుమతులు లేకపోతే లాయర్లు కూడా ఏమీ చేయలేరని అంటున్నారు. సొంతంగా కూల్చి వేయడమో.. గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేేస వరకూ ఎదురు చూడటమో చేయాలంటున్నారు. అలీ అనుమతులు తీసుకుంటే సరిపోతుందని స్థానికులు చెబుతున్నారు.