Chitrapuri colony: చిత్రపురి కాలనీ ప్లాట్ల వివాదం.. ప్ర‌ముఖుల‌పై నాన్ బెయిలబుల్ కేసులు

ABN , Publish Date - Sep 11 , 2024 | 12:15 PM

చిత్రపురి కాలనీ సంక్షేమ సంఘం మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. చిత్రపురి కాలనీలోని ప్లాట్ల కేటాయింపుల్లో భారీ అవకతవకల నేప‌థ్యంలో ప‌లువురు ప్ర‌ముఖుల‌పై నాన్ బెయిల‌బుల్ కేసులు న‌మోద‌య్యాయి.

tolywood

చిత్రపురి కాలనీ సంక్షేమ సంఘం మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. చిత్రపురి కాలనీలోని ప్లాట్ల కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని, డబ్బులు చెల్లించిన కమిటీ సభ్యులకు కాకుండా బ‌య‌టి వారికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు ఇలా రోజుకోర‌కంగా కొత్త విష‌యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్ర‌మంలో రెండు మూడు నెల‌ల క్రితం సంఘం అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అరెస్ట్‌తో ఒక్క‌సారిగా ఈ ఇష్యూ హైలెట్ అయింది.

ఇదిలాఉండ‌గా.. గత నెలలో చిత్రపురి కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించారని, నాటి పాలక వర్గం దొంగచాటుగా నిర్మాణాలకు అనుమతులు పొందిన‌ట్లు తేల్చి 225 విల్లాలకు మణికొండ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. జీ ప్లస్ వన్ కి అనుమతులు పొంది అక్రమంగా జీ ప్లస్ టూ నిర్మాణాలు చేయ‌డంపై మున్సిపల్ అధికారులు సైతం వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ క్ర‌మంలో తాజాగా సైబరాబాద్ డీసీపీ ఆధ్వ‌ర్యంలో ఖాజాగూడ చిత్రపురి కమిటీపై సైబరాబాద్ ఏకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW)లో మూడు FIR లు 46/2024, 47/2024, 52/2024 నమోదవ్వ‌డంతో పాటు ప్రస్తుత, పాత కమిటీల‌లోని మొత్తం 21 మందిపైన నాన్ బెయిలబుల్ సెక్షన్ 120B కింద కేసు నమోద‌య్యాయి.


cf5e7b08e6cedfb.jpeg

కేసులు నమోదైన వారిలో అనిల్ కుమార్ యాదవ్,తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, , దీప్తి వాజపేయి, కాదంబరి కిరణ్, వినోద్ బాల, ప్రవీణ్ యాదవ్, సత్యనారాయణ దోరా, టీ. లలిత, ఆలహరి వివి ప్రసాద్, కొంగర రామకృష్ణ, అనిత నిమ్మగడ్డ, రఘు బత్తుల, మహేంద్ర రెడ్డి, జెల్లా మధుసూదన్, పీఎస్ కృష్ణ మోహన్ రెడ్డి, కె.రాజేశ్వరరెడ్డి, చంద్రమధు, దేవినేని బ్రహ్మానందరావు, కొల్లి రామకృష్ణ, కె.ఉదయభాస్కర రావులు ఈ లిస్టులో ఉన్నారు. అయితే ఇప్పుడు వీరందరిపై కేసులు నమోదవడంతో సినిమా ఇండస్ట్రీలో కలవరం ప్రారంభ‌మైంది.

Updated Date - Sep 11 , 2024 | 12:17 PM