Rana -35: రానా సమర్పణలో.. ‘35 - చిన్న కథ కాదు’

ABN , Publish Date - Jun 25 , 2024 | 02:39 PM

నివేదా థామస్‌ (Nivetha Thomas) పెళ్లి చేసుకోనున్నారంటూ రెండు రోజులుగా నెట్టింట గాసిప్పులు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలు చెక్‌ పెట్టారు నివేదా. కొత్త చిత్రాన్ని ప్రకటించి రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు.

Rana -35: రానా సమర్పణలో.. ‘35 - చిన్న కథ కాదు’


నివేదా థామస్‌ (Nivetha Thomas) పెళ్లి చేసుకోనున్నారంటూ రెండు రోజులుగా నెట్టింట గాసిప్పులు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలు చెక్‌ పెట్టారు నివేదా. కొత్త చిత్రాన్ని ప్రకటించి రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల తన ఇన్‌స్టా స్టోరీలో ‘ఎన్నో రోజుల తర్వాత.. ఫైనల్లీ’ అని రాశారు. దీనికి లవ్‌ సింబల్‌ను జోడించారు. దీంతో ఈ హీరోయిన్‌ పెళ్లి (nivetha Marriage) పీటలెక్కనుందని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ రూమర్స్‌కు చెక్‌ పెడుతూ ‘చాలా రోజులు వేచి చూశారు. ఇది నా స్పెషల్‌ ఫిల్మ్‌’ అని కొత్త సినిమా విశేషాలు చెప్పారు. దీంతో ఆమె పెట్టిన స్టేటస్‌ పెళ్లి గురించి కాదని.. కొత్త సినిమా గురించేనని క్లారిటీ వచ్చింది. ‘35 - చిన్న కథ కాదు’ (35 - Chinna katha kadhu) అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati)ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సృజన ఎర్రబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మాతలు.

35.jfif
ఈ సినిమా పోస్టర్‌ను రానా ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా పంచుకున్నారు. పవిత్ర భూమి తిరుపతి నేపథ్యంలో జరిగే కథ అని.. అందరి హృదయాలను హత్తుకుంటుందని ఆయన చెప్పారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. నందకిశోర్‌ అనే కొత్త దర్శకుడు  ఇండస్ట్రీకి  పరిచయం కానున్నారు. ప్రియదర్శి, నివేదా థామస్‌ జంటగా నటిస్తుండగా సీనియర్‌ నటి గౌతమి కీలక పాత్ర పోషిస్తున్నారు. 

"11 ఏళ్ల కుర్రాడు గణితశాస్త్రంలోని ప్రాథమికాంశాలను స్కూల్‌ని వదిలేసిన తన తల్లి నుంచి ఎలా తెలుసుకున్నాడు’ అనేది ఆసక్తికరంగా మలిచాం’’ అని దర్శకుడు నందకిశోర్‌ చెప్పారు. ఈ చిత్రం తన కెరీర్‌కు ఎంతో ప్రత్యేకం కానుందని నటి నివేతా థామస్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్‌ సాగర్‌ అందిస్తున్నారు. 

Updated Date - Jun 25 , 2024 | 02:57 PM