Robinhood: నితిన్ పట్టుబట్టిన వినలేదు..
ABN , Publish Date - Dec 16 , 2024 | 03:31 PM
హీరో నితిన్ ఎంత పట్టుబట్టిన నిర్మాతలు మాట వినడం లేదు. దీంతో నితిన్ ‘రాబిన్‌హుడ్’ రిలీజ్‌పై ఉత్కంఠ ఏర్పడింది.
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఫిల్మ్ ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమాని దాదాపు రూ. 70 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుంది. ఈ సినిమాని మేకర్స్ మొదట డిసెంబర్ 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తర్వాత డిసెంబర్ 25కి పోస్ట్ పోన్ చేశారు. తర్వాత సంక్రాంతికి బరిలో దిగుతుందన్నారు. ఇప్పుడు ఏకంగా రేసు నుండే అవుట్ అంటున్నారు.
ఈ సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ 'పుష్ప 2'ని కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఒకవైపు భారీ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిటర్స్ నితిన్ ‘రాబిన్‌హుడ్’ రిలీజ్ ని వాయిదా వేయాలని కోరుతున్నారు. దీంతో మేకర్స్ ‘రాబిన్‌హుడ్’ విడుదలను వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇది సినిమాకే కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇక మరోవైపు డిసెంబర్ 20, 25 తేదీల మధ్య అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రధానంగా ఉపేంద్ర యుఐ, విజయ్ సేతుపతి విడుదల 2, అల్లరి నరేష్ బచ్చల మల్లికి మంచి క్రేజ్ ఉంది. ఇంకోవైపు అప్పటివరకు పుష్ప క్రేజ్ తగ్గే ఛాన్సే లేదు.
ఇక జనవరి రెండవ వారంలో భారీ సినిమాలు సంక్రాంతి సందర్భంగా చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలయ్య 'డాకు మహారాజ్', వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు పోటీలు నిలిచాయి. దీంతో నితిన్ ‘రాబిన్‌హుడ్’ని శివరాత్రికి షిఫ్ట్ చేసినట్లు సమాచారం. అయితే హీరో నితిన్ ఈ సినిమాని డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టిన నిర్మాతలు వినకపోవడం గమనార్హం.