Re Release: అన్నయ్యతో తమ్ముడి అభిమాని ఢీ..
ABN , Publish Date - Dec 27 , 2024 | 10:09 AM
మెగాస్టార్ చిరంజీవి, హీరో నితిన్ ఒకే రోజు పండగ పూట ఒకరితో ఒకరు ఢీ కొట్టనున్నారు. ప్రస్తుతం వీరిద్దరి సినిమాల రిలీజ్ డేట్లపై క్లారిటీ లేదంటే పోటీ అంటారేం అనుకుంటున్నారా. అవును, పోటీ ఉంది ఎప్పుడంటే..
మెగాస్టార్ చిరంజీవితో పోటీ అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలే పక్కకు తప్పుకుంటారు. అలాంటిది నితిన్ ఎందుకు పోటీలో నిలుస్తున్నాడు అనుకుంటున్నారా! ఎవరు ఎలా అనుకున్న చిరు, నితిన్ మూవీస్ ఒకే రోజున రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం చిరు 'విశ్వంభర', నితిన్ 'రాబిన్ హుడ్' సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. కానీ.. రిలీజ్ డేట్లపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమాల రిలీజ్ కు ముందే వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టనున్నారు. ఇంతకీ ఆ మూవీస్ ఏంటి రిలీజ్ ఎప్పుడంటే..
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే చిరు, నాగార్జున, మహేష్ బాబు, రవి తేజ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు తమ సినిమాలని రీ రిలీజ్ చేయగా కాసుల వర్షం కురిసింది. వీరితో పాటు కొందరు స్మాల్ హీరోలు కూడా తమ సినిమాలు రీ రిలీజ్ చేసుకున్నారు. కొన్ని బాల బస్టర్లుగా నిలవగా మరికొన్ని తుస్సుమన్నాయి. ఇక న్యూ ఇయర్ సందర్భంగా రెండు తెలుగు సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. ఒక మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ మూవీ హిట్లర్, మరొకటి నితిన్, రాజమౌళిల స్పోర్స్ట్ డ్రామా ఫిల్మ్ ‘సై’. ఈ రెండు సినిమాలు జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ విధంగా నితిన్.. మెగాస్టార్ తో క్లాష్ కానున్నారు.
వెనక్కి వెళ్లిన నితిన్
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాబిన్ హుడ్’ . మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాణసంస్థ ప్రకటించింది. అనుకోని పరిస్థితుల వల్ల సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందంటూ మైత్రీ మూవీస్ పోస్ట్ పెట్టింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. నితిన్- వెంకీ కుడుముల కలయికలో రానున్న రెండో చిత్రమిది. శ్రీలీల కథానాయిక. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల చిత్రబృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ షూటింగ్ అప్‌డేట్ పంచుకుంది. షూటింగ్ దాదాపు పూర్తయిందని ఒక్క పాట మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యబైనట్లు సమాచారం. నితిన్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలు మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి.