Nithiin - Multplex: ఏషియన్ నితిన్ సితారా 'కల్కి'తో షురూ!

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:52 PM

హీరో నితిన్(Nithiin)మల్టీప్లెక్స్‌ థియేటర్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త కొంతకాలంగా నెట్టింట వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! దానిని నిజం చేశారు నితిన్.

Nithiin - Multplex: ఏషియన్ నితిన్ సితారా 'కల్కి'తో షురూ!


హీరో నితిన్(Nithiin)మల్టీప్లెక్స్‌ థియేటర్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త కొంతకాలంగా నెట్టింట వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! దానిని నిజం చేశారు నితిన్. మహేష్‌బాబు మొదలుకొని అల్లు అర్జున్‌, రవితేజ, విజయ్‌ దేవరకొండ వరకూ థియేటర్స్‌ బిజినెస్‌లో ఉన్నారు. ఇప్పుడు నితిన్ కూడా ఆ జాబితాలో చేరారు. ఏషియన్‌ సంస్థతో కలిసి 'ఏషియన్‌ నితిన్‌ సితార' (Asian nithiin Sitara) అనే మల్టీప్లెక్స్‌ ప్రారంభించారు. 

Asian.jpg

నితిన్‌కు ఇంతకుముందే సితార థియేటర్‌ ఉంది. సంగారెడ్డిలో ఉన్న ఈ థియేటర్‌ను రెనోవేషన్‌ చేయించి ఏషియన్‌ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్‌గా మార్చారు. దీనికి ఏషియన్‌ నితిన్‌ సితార అని పేరు పెట్టారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. ప్రభాస్‌ హీరోగా నటించిన కల్కి 2898 ఎడీ’ చిత్రంతో ఈ మల్టీప్లెక్స్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నితిన రాబినహుడ్‌, తమ్ముడు చిత్రాలతో బిజీగా ఉన్నారు.



Updated Date - Jun 27 , 2024 | 05:51 PM