Nithiin: తండ్రైన నితిన్.. షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు
ABN , Publish Date - Sep 06 , 2024 | 06:55 PM
టాలీవుడ్ హీరో నితిన్ (nithiin) తండ్రి అయ్యారు. ఆయన భార్య షాలిని (Shalini) పండంటి మగబ్డికు (Baby boy) జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
టాలీవుడ్ హీరో నితిన్ (nithiin) తండ్రి అయ్యారు. ఆయన భార్య షాలిని (Shalini) పండంటి మగబ్డికు (Baby boy) జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జూలై 16, 2020లో నితిన్, షాలిని వివాహం జరిగింది. కొద్దిరోజుల క్రితమే ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే తాజాగా షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని నితిన్ తెలిపారు. చిన్నారి చెయ్యి ఫొటోను పంచుకుంటూ.. ‘మా ఫ్యామిలీ న్యూ స్ట్టార్‌కు ఆహ్వానం’ అని నితిన్ క్యాప్షన్ పెట్టారు. అభిమాన హీరో తండ్రిగా మారడంతో నితిన్ ఫ్యాన్స్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాక్షాంక్షలు తెలుపుతున్నారు. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్‌హుడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేేసందుకు మేకర్స్ సిద్థమవుతున్నారు.