Niranjan Reddy: వకీల్ సాబ్ నిరంజన్ రెడ్డి.. అల్లు వ్యూహం

ABN , Publish Date - Dec 13 , 2024 | 07:49 PM

ఈరోజు అల్లు అర్జున్ రిలీజ్ కావడంలో కీలక పాత్ర పోషించిన నిరంజన్ రెడ్డి గురించి మీకు తెలుసా..

నిరంజన్ రెడ్డి.. ఈరోజు అల్లు అర్జున్ కేసులో కీలక పాత్ర పోషించిన న్యాయవాది. ఈయన వాదనల గురించి చాలా మంది వినడమే కానీ ఎప్పుడు చూడలేదు.. ఈరోజు ఆయనని చూస్తే తెలుస్తుంది ఎంత పెద్ద లాయారో అని పలువురు కామెంట్ చేస్తున్నారు. సినిమా ప్రొడ్యూసర్, రాజ్యసభ సభ్యుడిగానే మనందరికీ పరిచయమున్న నిరంజన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..


గగనం, క్షణం, ఘాజి, వైల్డ్ డాగ్, ఆచార్య వంటి సినిమాలని నిర్మించిన నిరంజన్ రెడ్డి వృత్తి రీత్యా న్యాయవాది. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు వంటి హైప్రొఫైల్ కేసులను సుప్రీంకోర్టులో డీల్ చేశాడు. అలాగే వైసీపీ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయనను జగన్ ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో స్కిల్ ఫుల్ లాయర్ గా మంచి పేరుంది.


ఈరోజు అల్లు అర్జున్ కేసు విషయంలోనూ ఆయన కోర్టులో వినిపించిన వాదనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆయన క్వాష్ పిటిషన్‌ ద్వారా అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. షారుక్ నటించిన ఓ సినిమా విడుదల టైమ్ లో కూడా ఓ అభిమాని మరణించారని, అయితే ఆ వ్యక్తి మరణానికి షారుక్ కి ఎలాంటి సంబంధం లేదని కోర్టు తేల్చింది. షారుక్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని గుర్తించిన గుజరాత్ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందనే విషయాన్ని నిరంజన్ రెడ్డి కోర్టుకు బలంగా వినిపించారు. పుష్ప-2 రిలీజ్ టైమ్ లో కూడా ఇదే జరిగిందని అన్నారు. దీంతో జడ్జ్ సైతం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒకరోజు కస్టడీ తీసుకుంటే సరిపోయేదానికి , అరెస్ట్ చేసే వరకు ఎందుకు వెళ్లారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో అల్లు అర్జున్‌ ను మధ్యంతర బెయిల్‌తో పాటు, రూ.50 వేల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం చేశారు. అలాగే ఆయన అర్ణబ్ గోస్వామి కేసును కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


అయితే ఇటీవలి కాలంలో ఆయన పబ్లిక్ గా కోర్టులకి హాజరు కావడం మానేశారు. కానీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి ఆయనను రంగంలో దించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Updated Date - Dec 13 , 2024 | 07:49 PM